భక్తులకు అందుబాటులో 1,05,711 ఆర్జిత సేవాటికెట్లు

భక్తులకు అందుబాటులో 1,05,711 ఆర్జిత సేవాటికెట్లు

శ్రీవారి ఆలయంలో త్వరలో మరో హుండీ ఏర్పాటు డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమంలో తితిదే ఈవో డా|| డి.సాంబశివరావు శ్రీవారి ఆర్జిత సేవలకు సంబంధించి నవంబరు, డిసెంబరు నెలల్లో భక్తులు బుక్‌ చేసుకునేందుకు వీలుగా శుక్రవారం ఉదయం 11.00 గంటలకు 1,05,711 టికెట్లను ఇంటర్నెట్‌లో విడుదల చేసినట్టు తితిదే కార్యనిర్వహణాధికారి డా|| డి.సాంబశివరావు వెల్లడించారు. అక్టోబరులో మొదటి శుక్రవారం 7వ తేదీన బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవ కావడంతో సేవా టికెట్ల విడుదల సాధ్యం కాదని, ఈ కారణంగానే రెండు నెలలకు సంబంధించిన సేవా టికెట్లను విడుదల చేశామని తెలిపారు. విజయవాడకు చెందిన భవానీశంకర్‌ అడిగిన ప్రశ్నకు ఈవో సమాధానమిస్తూ శ్రీవారి ఆలయంలో ప్రస్తుతమున్న కొప్పెరహుండీ వద్ద భక్తుల తోపులాటను అరికట్టేందుకు సమీపంలోని లక్ష్మీదేవి విగ్రహం చెంత మరో కొప్పెరహుండీని ఏర్పాటుచేస్తామని వెల్లడించారు. తీర్థం, శఠారి వద్ద ఇచ్చే…

Read More

శ్రీవారి జన్మనక్షత్రం చరిత్ర

శ్రీవారి జన్మనక్షత్రం చరిత్ర

న నక్షత్రమండలమైన పాలపుంత విష్ణుచక్రాకారంలో వుంటుంది. ఈ చక్రాకారం యొక్క ఒక అంచులోనిదే సూర్యమండలం. మన సూయునివంటి కోట్లాది నక్షత్రాలతో కూడినదే పాలపుంత. ఇందులో మధ్యన ఉన్న మకరరాశిలోని శ్రవణా నక్షత్రం నుండి విష్ణువు భూలోకానికి దిగివచ్చినట్టు పురాణాలు చెపుతున్నాయి. అందుకే స్వామివారి జన్మనక్షత్రం శ్రవణంగా జరుపుకుంటున్నాము. వేయి సూర్యులకాంతిలో ప్రకాశించే దివ్య త్రిదశవిమానంలో సిద్ధ సాధ్య కిన్నెరా కింపురుష గరుడ గంధర్వ అప్సరోగణాలతో పరివేష్టించబడి స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా వచ్చినట్టు శ్రీవారి ఆవిర్భావఘట్టంలో వర్ణించబడివున్నది. ఆ దివ్యవిమానం యొక్క ప్రతిరూపమే నేటి ఆనందనిలయ విమానం. ఆ దివ్యవిమానం ఇప్పటికీ సామాన్య మానవుల దృష్టికి అదృశ్యంగా నారాయణగిరి సానువులలో నిక్షిప్తమై వున్నట్లు కూడా చెప్పబడింది. > శ్రీ వెంతకేశ్వర స్వామివారి దివ్యమంగళ సాలగ్రామ శిలా స్వరూపం సుమారు 9 1/2 అడుగుల ఎత్తు వుంటుంది. శ్రీవారికి…

Read More

టీటీడీ ప్రధాన ఆశయాల్లో శేషాచల పర్యావరణ పరిరక్షణం ప్రథమం – టీటీడీ  ఛైర్మెన్‌

టీటీడీ ప్రధాన ఆశయాల్లో శేషాచల పర్యావరణ పరిరక్షణం ప్రథమం – టీటీడీ  ఛైర్మెన్‌

తిరుమల శేషాచలం అడవులు పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ముందుకు సాగుతున్న టీటీడీ. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వనం మనం కార్యక్రమం పిలుపు మేరకు శుక్రవారం నాడు తిరుమలలోని శ్రీగంధం వనంలో మొక్కలు నాటడంలో ఉద్యోగులను, శ్రీవారి సేవకులను భాగస్వామ్యంతో మొక్కలు నాటే బృహత్కార్యక్రమాన్ని చేపట్టిందని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు డాక్టర్‌ చదలవాడ క్రిష్ణమూర్తి అన్నారు.   శుక్రవారం నాడు తిరుమల పార్వేట మండపం సమీపంలో ఉన్న శ్రీగంధ వనంలో ”వనం-మనం” కార్యక్రమంలో భాగంగా టీటీడీ ఈవో డాక్టర్‌ డి.సాంబశివరావు, తిరుమల జెఇఓ శ్రీ కె.ఎస్‌. శ్రీనివాసరాజులతో కూడి శ్రీగంధం మొక్కలు నాటే కార్యక్రమంలో టీటీడీ ట్రస్ట్‌బోర్డు ఛైర్మెన్‌ పాల్గొన్నారు.   అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ చెట్లునాటే బృహత్తర కార్యక్రమాన్ని టీటీడీ గత ఎన్నో దశాబ్దాలుగా నిర్వహిస్తూ పర్యావరణ పరిరక్షణలో తమవంతు ధర్మాన్ని నిర్వహిస్తున్నదన్నారు. తిరుమల…

Read More

ఒకే గొడుగు కిందికి టీటీడీలోని ఐటి అప్లికేషన్లు :ఈవో డి.సాంబశివరావు

ఒకే గొడుగు కిందికి టీటీడీలోని ఐటి అప్లికేషన్లు :ఈవో డి.సాంబశివరావు

భక్తుల సౌకర్యార్థం టీటీడీలోని ఆయా విభాగాలు నిర్వహిస్తున్న ఐటి అప్లికేషన్లు అన్నింటినీ ఒకే గొడుగు కిందికి తీసుకొచ్చి టిసిఎస్‌ సంస్థ ఆధ్వర్యంలో మరింత మెరుగ్గా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని టీటీడీ కార్యనిర్వహణాధికారి డా|| డి.సాంబశివరావు సంబంధిత అధికారులకు సూచించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో గల కార్యాలయంలో సోమవారం సీనియర్‌ అధికారులతో ఈవో వారపు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ధర్మప్రచారంలో భాగంగా సప్తగిరి మాసపత్రికను రాష్ట్రంలోని అన్ని గ్రంథాలయాలకు ఉచితంగా పంపిణీ చేయాలని, తద్వారా ఎక్కువ మంది పాఠకులకు చేరుతుందని తెలిపారు. టీటీడీ విద్యాసంస్థల్లో ఖాళీగా ఉన్న సీట్లకు సంబంధించి అడ్మిషన్లను సకాలంలో పూర్తి చేయాలన్నారు. టీటీడీకి అవసరమైన చింతపండు, బెల్లం సరఫరాకు సంబంధించి సరఫరాదారులతో త్వరలో సమావేశం ఏర్పాటుచేయాలని మార్కెటింగ్‌ అధికారులకు సూచించారు. చింతపండు, బెల్లం ఉత్పత్తి ఎక్కువశాతం చిత్తూరు,…

Read More

పరకామణి విభాగాన్ని ఆధునీకరిస్తాం : టీటీడీ ఈవో డా|| డి.సాంబశివరావు

పరకామణి విభాగాన్ని ఆధునీకరిస్తాం : టీటీడీ ఈవో డా|| డి.సాంబశివరావు

తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించే కానుకలను మరింత పారదర్శకంగా లెక్కించేందుకు వీలుగా పరకామణి విభాగాన్ని నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఆధునీకరిస్తామని టీటీడీ కార్యనిర్వహణాధికారి డా|| డి.సాంబశివరావు తెలిపారు. తిరుమల శ్రీవారి ఆలయంలోని పరకామణి విభాగాన్ని శుక్రవారం సాయంత్రం తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజుతో కలిసి ఈవో తనిఖీ చేశారు. దాదాపు మూడు గంటల పాటు నోట్లు, చిల్లర నాణేలు లెక్కించే విధానాన్ని పరిశీలించారు. ఇక్కడ చేయాల్సిన మార్పులపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ శ్రీవారి ఆలయంలోని పరకామణి విభాగంలో పొరబాట్లకు తావులేకుండా తక్కువ సమయంలో వేగవంతంగా నోట్లను లెక్కించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో చిల్లర నాణేల పరకామణి నూతన భవనాన్ని అన్ని వసతులతో నిర్మిస్తున్నామని తెలిపారు. ఇక్కడ నాణేలను లెక్కించేందుకు అవసరమైన యంత్రాంగాన్ని సిద్ధం…

Read More

శ్రీవారి కొలువులో లక్ష్మి(గజరాజు)

శ్రీవారి కొలువులో లక్ష్మి(గజరాజు)

తిరుమల: శ్రీవారి కొలువులో లక్ష్మి అనే గజరాజు ఇకపై సేవలు అందించనుంది. దశాబ్ద కాలంగా తిరుమలలో సేవలు అందిస్తున్న పద్మావతి అనే గజరాజు స్వల్ప అనారోగ్యానికి గురి కావడంతో ఆ స్థానంలో తిరుపతిలోని టి‌టి‌డి అనుబంధ ఆలయాల్లో సేవలు అందిస్తున్న లక్ష్మి అనే గజరాజును శుక్రవారం తిరుమలకు తీసుకువచ్చారు. ఇకపై పద్మావతి(గజరాజు) స్థానంలో లక్ష్మి(గజరాజు) సేవలు అందించనుంది. అనారోగ్యానికి గురైన పద్మావతిని(గజరాజు) శుక్రవారం టి‌టి‌డి సిబ్బంది కాలినడకన తిరుపతికి తీసుకువెళ్లారు. అక్కడ ఎస్వీ గోశాలలో గజరాజుకు చికిస్థ అందించనున్నారు.

Read More

తలనీలాల విక్రయం ద్వారా టీటీడీ ఆదాయం రూ.12.45 కోట్లు

తలనీలాల విక్రయం ద్వారా టీటీడీ ఆదాయం రూ.12.45 కోట్లు

కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసే కోటానుకోటి భక్తులు భక్తిశ్రద్ధలతో సమర్పించిన తలనీలాల ఈ-వేలంలో టీటీడీ రూ.12.45 కోట్ల ఆదాయాన్ని గడించింది. శుక్రవారం నాడు తలనీలాల ఈ వేలం జరిగింది. మొదటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, తెల్లవెంట్రుకలు తలనీలాల రకాల ఈ-వేలం నిర్వహించారు. ఈ నెల నిర్వహించిన ఈ-వేలంలో మొత్తం 14,500 కిలోల తలనీలాలు అమ్ముడుపోయాయి. తలనీలాలలో మొదటి రకం(31 ఇంచుల పైన), రెండో రకం(16 నుండి 30 ఇంచులు), మూడో రకం(10 నుండి 15 ఇంచులు), నాలుగో రకం(5 నుండి 9 ఇంచులు), ఐదో రకం(5 ఇంచుల కన్నా తక్కువ), తెల్లవెంట్రుకల రకాలను టీటీడీ ఈ-వేలంలో పెట్టింది. కిలో రూ.25,563/-గా ఉన్న మొదటి రకం తలనీలాలను మొత్తం 3700 కిలోలను వేలానికి ఉంచగా 300 కిలోలు అమ్ముడుపోయాయి. తద్వారా…

Read More

లోక క్షేమం కోసం పాదయాత్ర

లోక క్షేమం కోసం పాదయాత్ర

తిరుపతి: ప్రపంచ౦ లోని అన్ని జీవరాశులు సుఖ, సంతోషాలతో వు౦డాలని, దేశంలోని 22 రాష్ట్రలతో పాటు నేపాల్ వరకు వేల కిలోమీటర్ల పాదయాత్రలో భాగంగా తిరుపతికి చేరుకున్న ఓ సాదువును మా ప్రతినిధి పలకరించగా తమ యాత్రలో భాగంగా శ్రీవారి మొక్కు చేలించుకొని ఇక్కడి నుండి నేపాల్ వరకు తన పాదయాత్ర కొనసాగించబోతునా నంటున్న కోయంబత్తురుకు చెందిన “ స్వామి భగీరథ దాస్ పాదయాత్ర “ పై మా ప్రతినిధి సురేష్ ప్రత్యేక కథనం.. ఒకటి కాదు రెండుకాదుఏకంగా వేల కిలో మీటర్లు…. దేశంలోని నలుమూళ్లలో వుండే 22 రాష్ట్రలతో పాటు నేపాల్ వరకు ఇలా మొత్తం 15 వేల కిలో మీటర్లు పాదయాత్రకు సంకల్పించిన స్వామి భగీరథ దాస్ మే నెల 24వ తేదీ ఈ ఏడాదిలో కన్యాకుమారి నుండి తమ యాత్రను ప్రారంభించి లోక…

Read More

చిరుతల కోసం బోనులు

చిరుతల కోసం బోనులు

తిరుమలలో ఆపరేషన్ చిరుత మొదలైంది. గత నెల రోజులుగా అటు స్థానికులను,ఇటు శ్రీవారి భక్తులను కంటి మీద కునుకు లేకుండా చేసిన చిరుతలను బందించేందుకు ఎట్టకేలకు టీటీడీ అటవీ శాఖ కసరత్తు ప్రారంభించింది. స్థానికులు నివాసం ఉండే బాలాజీ నగర్ కాలనిలో చిరుతపులులు సంచరించే ప్రాంతాలలో నాలుగు బోనులను ఏర్పాటు చేశామని తెలిపారు అటవీ అధికారులు.. పవిత్ర పుణ్య క్షేత్రం తిరుమలకు నిత్యం వేలాదిగా భక్తులు తరలివస్తుంటారు. సుమారు 5000 మంది స్థానికులు నివశిస్తుంటారు దటమైన అటవీ ప్రాంతంకవడంతో వన్య ప్రాణులు సంచర౦ ఎకువగా వుంటుంది. అయితే ఇటీవల చిరుత పులుల సంచారం మీతి మీరిపోయింది శివారు ప్రాంతాల నుండి ఏకంగా జనవసలలోకి చిరుతలు వచ్చేస్తున్నాయి. దీంతో రాత్రి వెళ్ళలో బయట తిరగాలంటే భయపడే పరిస్థితులు దాపరించాయి. సుమారు నాలుగు చిరుతలు రెండు జంటలుగా ఏర్పడి బాలాజీ…

Read More

5000 యేళ్ళ కిందట తిరుమలపై శ్రీనివాసుడి సాక్షాత్కారం

5000 యేళ్ళ కిందట తిరుమలపై శ్రీనివాసుడి సాక్షాత్కారం

తిరుమల వెంకన్న ఏడుకొండలపై సాక్షాత్కారం ఎప్పుడు వచ్చారంటే చాలామందికి ఈ విషయం తెలియదు. 5000 యేళ్ళ కిందట స్వామివారు స్వయం వ్యక్తమూర్తియై ఏడుకొండలపైకి ఎక్కారు. ఇది నిజంగా నిజం. మరో ప్రధానమైన విషయమేమిటంటే శ్రీవారి మొదటి పేరు సాలగ్రామ శిలామూర్తి. అప్పట్లో శ్రీవారు ఈ పేరుతోనే పూజలందుకునేవారు. శ్రీనివాసుని మహిమను తెలుసుకున్న భక్తులు అప్పట్లోనే వందలాదిగా ఏడుకొండలకు తరలివచ్చేవారు. అప్పటి నుంచి ఇప్పటివరకు గోవిందుని దర్శించుకునే భక్తులు సంఖ్య లక్షల్లో ఉంటోంది. ప్రస్తుతం చాలామందికి స్వామివారి మొదటి పేరు తెలియదంటే ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పురాణాల్లో మాత్రమే స్వామివారు ఎన్ని ఏళ్ళ కిందట ఇక్కడకు వచ్చారన్న విషయం ఉంది. శ్రీనివాసునికి ఒక పేరు కాదు, ప్రపంచంలోనే ఏ దేవునికి లేని పేర్లు ఉన్నాయని పురాణాలు చెబుతున్నాయి. అందులో కలియుగ వైకుంఠుడు,ఆపద మ్రొక్కులవాడు, అడుగడుగు దండాల వాడు,…

Read More