సెప్టెంబరు 2న డయల్‌ యువర్‌ ఇ.ఓ

సెప్టెంబరు 2న డయల్‌ యువర్‌ ఇ.ఓ

ప్రతినెలా మొదటి శుక్రవారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో నిర్వహించే డయల్‌ యువర్‌ ఇ.ఓ కార్యక్రమం సెప్టెంబరు 2వ తేదీ ఉదయం 8.30 గం||ల నుండి 9.30 గం||ల నడుమ జరుగనుంది. ఈ కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను తి.తి.దే కార్యనిర్వహణాధికారి డా||డి.సాంబశివరావు గారికి ఫోన్‌ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చు. అందుకు భక్తులు సంప్రదించవలసిన నెంబరు. 0877-2263261.

Read More

తిరుపతి ప్రెస్ క్లబ్ మీడియా స్పోర్ట్స్ ముగింపు

తిరుపతి ప్రెస్ క్లబ్ మీడియా స్పోర్ట్స్ ముగింపు

తిరుపతి ప్రెస్ క్లబ్ మీడియా స్పోర్ట్స్ ముగింపు కార్యక్రమ౦ లొ మాట్లాడుతూన్న కార్యదర్శి కె.గిరిబాబు.పక్కన రాష్ట ఉపముఖ్యమ౦త్రి కె.ఈ.క్రిష్ణమూర్తి.ఎమ్.ఎల్.ఎ.సుగుణమ్మ.టిటిడి బొర్డుసభ్యులు జి.భానుప్రకాష్ రెడ్డి.డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్. పులిగొరు మురళి.డాక్టర్ సుధారాణి.తదితరులు

Read More

ఆగస్టు 25న ఎస్వీ గోసంరక్షణశాలలో గోకులాష్టమి వేడుకలు

ఆగస్టు 25న ఎస్వీ గోసంరక్షణశాలలో గోకులాష్టమి వేడుకలు

టీటీడీ శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాల, శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణ ట్రస్టు ఆధ్వర్యంలో ఆగస్టు 25వ తేదీన గోకులాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా గోసంరక్షణశాలలో గోపూజ, సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టనున్నారు. శ్రీకృష్ణ భగవానుని జన్మదిన మహోత్సవాన్ని గోకులాష్టమిగా నిర్వహించడం హైందవ సంప్రదాయం. సనాతన హిందూ ధర్మ ప్రచారమే ప్రధాన లక్ష్యంగా స్వీకరించిన టీటీడీ హిందువుల అతిముఖ్యమైన పండుగలలో ఒకటైన జన్మాష్టమి వేడుకలను తిరుపతిలో ప్రతి ఏడాదీ అత్యంత ఘనంగా నిర్వహిస్తుంది. సాక్షాత్తు శ్రీ కృష్ణగోలోకాన్ని తలపించే విధంగా టీటీడీ శ్రీవేంకటేశ్వర గోశాలలో ఏర్పాట్లను చేయనుంది. భారీగా పందిళ్ళు, మామిడితోరణాలు, పూమాలలతో అలంకారాలు చేపట్టనుంది. గోశాలలోని గోసంపదను అందంగా అలంకరించి భూలోక గోకులంగా తీర్చిదిద్దేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడాది కూడా సందర్శకులు గోశాలలో బెల్లం, బియ్యం, పశుగ్రాసాన్ని భక్తులు స్వయంగా పశువులకు తినిపించే అవకాశాన్ని టీటీడీ…

Read More

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు 12న వరలక్ష్మీ వ్రతం

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు 12న వరలక్ష్మీ వ్రతం

సిరుల తల్లి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు 12వ తేదీ వరలక్ష్మీ వ్రతం వైభవంగా జరుగనుంది. వరలక్ష్మీ వ్రతానికి సంబందించి ఆగష్టుౖ 11వ తేదీ గురువారం ఉదయం 10.00 గంటల నుండి ఆలయం ఎదురుగా వున్న కుంకుమార్చన కౌంటర్లలో కరెంట్‌ బుకింగ్‌లో భక్తులు ఈ టికెట్లు పొందవచ్చు. ముందు వచ్చిన వారికి ముందు ప్రాతిపదికన ఒకరికి ఒక్క టికెటు మాత్రమే కేటాయిస్తారు. భక్తులు తమ ఐడి కార్డు జిరాక్స్‌ను తప్పక జత చేయవలేను. ఇందుకోసం 200 టికెట్లు భక్తులకు అందుబాటులో ఉంచారు. వరలక్ష్మీ వ్రతంలో పాల్గొనదలచిన భక్తులు(ఇద్దరు) రూ.500/- చెల్లించి పాల్గొనవచ్చును. వీరికి ఒక అంగవస్త్రం, ఒక రవిక, ఒక్క లడ్డూ, ఒక్క వడ బహుమానంగా ఇస్తారు. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. సాయంత్రం భక్తుల భజనలు, కోలాటాల నడుమ…

Read More

వరుస సెలవుల సందర్భంగా తిరుమలకు విచ్చేసే భక్తులకు ముందస్తు ఏర్పాట్లు

వరుస సెలవుల సందర్భంగా  తిరుమలకు విచ్చేసే భక్తులకు ముందస్తు ఏర్పాట్లు

ఆగష్టు 12 నుండి 15వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు వరుస సెలవులు వస్తున్న సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు విచ్చేసే అవకాశం ఉన్నందున వారికి ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని టీటీడీ కార్యనిర్వహణాధికారి డా|| డి.సాంబశివరావు అధికారులను ఆదేశించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో మంగళవారంనాడు జరిగిన సీనియర్‌ అధికారులు సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నాలుగు రోజులు వరుస సెలవులకు కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు త్వరిత గతిన దర్శనం, వసతికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. భక్తులకు అవసరమైనన్ని లడ్లు ముందస్తుగా నిల్వ ఉంచుకోవాలని సూచించారు. తిరుమల రిసెష్పన్‌.1 పరిధిలోని 64 డోనార్‌ వసతి గృహాల్లోగల 754 గదులకు భక్తుల సౌకర్యార్థం  ఆగష్టు 15వ తేదీ నుండి కాషన్‌ డిపాజిట్‌ రద్దు…

Read More

భక్తులకు అందుబాటులోకి యాత్రికుల వసతి సముదాయం-4 : ఈవో 

భక్తులకు అందుబాటులోకి యాత్రికుల వసతి సముదాయం-4 : ఈవో 

శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులు బస చేసేందుకు అన్ని సౌకర్యాలతో ప్రధాన కల్యాణకట్ట ఎదురుగా గల యాత్రికుల వసతి సముదాయం-4ను మంగళవారం నుంచి అందుబాటులోకి తీసుకొచ్చామని టీటీడీ ఈవో డా|| డి.సాంబశివరావు తెలిపారు. తిరుమలలో మంగళవారం ఆయన తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజుతో కలిసి పిఏసి-4ను విస్తృతంగా తనిఖీలు చేసి అభివృద్ధి పనులపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ పిఏసి-4లో భక్తుల సౌకర్యార్థం ఆధునిక వసతులతో కూడిన స్నానపుగదులు, మరుగుదొడ్లు ఉన్నట్టు తెలిపారు. కల్యాణకట్టలో టికెట్ల మంజూరుకు, పాదరక్షలు, లగేజి డిపాజిట్‌ చేసి, తిరిగి పొందేందుకు కౌంటర్లు పెంచుతున్నట్టు చెప్పారు. శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు సులభతరంగా దర్శనం, బస ఇతర వసతులు కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు మాట్లాడుతూ పిఏసి-4లో గ్రౌండ్‌…

Read More

త్వరలో సర్వదర్శనం భక్తులకు మరింత మెరుగైన వసతులు : టీటీడీ ఈవో డా|| డి.సాంబశివరావు

త్వరలో సర్వదర్శనం భక్తులకు మరింత మెరుగైన వసతులు :  టీటీడీ ఈవో డా|| డి.సాంబశివరావు

  త్వరలో సర్వదర్శనం భక్తులకు మరింత మెరుగైన వసతులు కల్పిస్తామని టీటీడీ కార్యనిర్వహణాధికారి డా|| డి.సాంబశివరావు వెల్లడించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో మంగళవారం సీనియర్‌ అధికారులతో సమీక్ష అనంతరం ఈవో మీడియాతో మాట్లాడారు. మొదటి దశలో రూ.300/- ప్రత్యేక ప్రవేశదర్శన కాంపెక్స్‌ పూర్తి చేశామని, రెండో దశలో దివ్యదర్శనం భక్తులకు బ్రహ్మోత్సవాలలోపు కాంప్లెక్స్‌ నిర్మిస్తామని, మూడో దశలో సర్వదర్శనం భక్తులకు కూడా ఇదే తరహాలో వసతులు కల్పిస్తామని వివరించారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోందని, శని, ఆదివారాల్లో 80 వేల నుంచి 90 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారని ఈవో తెలిపారు. భక్తులందరికీ ఎలాంటి లోటుపాట్లు లేకుండా మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగా పిఏసి-4ను మంగళవారం నుంచి భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. కల్యాణకట్టలో టోకెన్‌ మంజూరు కౌంటర్లు పెంచి త్వరగా…

Read More

టీటీడీకి విరాళాలిచ్చే దాతలకు ఇ-పాస్‌బుక్‌లు : ఈవో డా|| డి.సాంబశివరావు

టీటీడీకి విరాళాలిచ్చే దాతలకు ఇ-పాస్‌బుక్‌లు : ఈవో డా|| డి.సాంబశివరావు

టీటీడీకి విరాళాలిచ్చే దాతలకు మరింత పారదర్శకంగా సౌకర్యాలు కల్పించేందుకు వీలుగా ఇ-పాస్‌బుక్‌లు మంజూరుచేయాలని టీటీడీ కార్యనిర్వహణాధికారి డా|| డి.సాంబశివరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో గల కార్యాలయంలో సోమవారం సీనియర్‌ అధికారులతో ఈవో వారపు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి ఆలయం, సత్రవాడలోని శ్రీ కరివరదరాజ స్వామివారి ఆలయాలకు ప్రహరీ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు. నాదనీరాజనం ఎంపిక కమిటీలో నిష్ణాతులైన విద్వాంసులను నియమించాలని, తద్వారా మరింత మెరుగైన ప్రదర్శనలు ఏర్పాటు చేయాలన్నారు. భక్తులు తమ సూచనలు, ఫిర్యాదులు అందించేందుకు 24 గంటలు టీటీడీ కాల్‌ సెంటర్‌ అందుబాటులో ఉందని, దీనికి విస్తృత ప్రచారం కల్పించాలని సూచించారు. టీటీడీలోని జూనియర్‌, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల ప్రక్రియను త్వరగా…

Read More

కృష్ణా పుష్కరాల ఏర్పాట్లపై జెఈవో సమీక్ష

కృష్ణా పుష్కరాల ఏర్పాట్లపై జెఈవో సమీక్ష

పవిత్రమైన కృష్ణా నది పుష్కరాలు ఆగస్టు 12వ తేదీ నుంచి ప్రారంభంకానుండడంతో టీటీడీ తరఫున చేపడుతున్న ఏర్పాట్లపై తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు శుక్రవారం సాయంత్రం తిరుమలలోని అన్నమయ్య భవనంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ నవ్యాంధ్ర రాజధాని నగరంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న పుష్కరాల్లో విజయవాడలోని పిడబ్ల్యుడి మైదానంలో ఏర్పాటు చేయనున్న శ్రీవారి నమూనా ఆలయం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని తెలిపారు. వేలాది మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటారని, గతంలో జరిగిన గోదావరి పుష్కరాల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని అన్ని విభాగాల అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. టీటీడీ చేపడుతున్న ఏర్పాట్లపై రాష్ట్ర ముఖ్యమంత్రి గౌ|| శ్రీ నారా చంద్రబాబునాయుడు ప్రత్యేక దృష్టి పెడుతున్నట్టు వివరించారు. శ్రీవారి నమూనా ఆలయం పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని, ఈ నెలాఖరు లోపు పూర్తి…

Read More

భక్తుల సేవలో 24 గంటల పాటు టీటీడీ కాల్‌సెంటర్‌

భక్తుల సేవలో 24 గంటల పాటు టీటీడీ కాల్‌సెంటర్‌

తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో గల కాల్‌ సెంటర్‌ 24 గంటల పాటు భక్తులకు అందుబాటులో ఉంది. శ్రీవారి ఆలయం, ఇతర విభాగాలకు సంబంధించిన సమాచారాన్ని భక్తులు ఫోన్‌ ద్వారా, ఈ-మెయిల్‌ ద్వారా సంప్రదించి తెలుసుకోవచ్చు. అదేవిధంగా టీటీడీ అందిస్తున్న వసతులపై సూచనలు, సలహాలు చేయవచ్చు. భక్తుల సమస్యలు, సూచనలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తారు. కాల్‌ సెంటర్‌లో ల్యాండ్‌లైన్‌ నంబర్లు, టోల్‌ఫ్రీ నంబర్లు, వాట్స్‌ యాప్‌ నంబరు, ఈ-మెయిల్‌ ఐడి అందుబాటులో ఉన్నాయి. ల్యాండ్‌ లైన్‌ నంబర్లు : 0877-2233333, 2277777 టోల్‌ఫ్రీ నంబర్లు : 18004254141, 1800425333333 వాట్స్‌ యాప్‌ నంబరు : 9399399399 ఈ-మెయిల్‌: helpdesk@tirumala.org

Read More