శ్రీవారి ఆలయం తరహాలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆర్జితసేవా టికెట్లు జారీ – తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌

శ్రీవారి ఆలయం తరహాలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆర్జితసేవా టికెట్లు జారీ – తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌

సిరులతల్లి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నిత్యం జరిగే ఆర్జితసేవలకు సంబంధించిన టికెట్ల జారీని మరింత సరళతరం చేయనున్నట్లు తితిదే తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ పోల భాస్కర్‌ తెలిపారు. తిరుపతిలోని తితిదే పరిపాలన భవంనంలోని తమ కార్యాలయంలో గురువారం ఉదయం ఆయన అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగే ఆర్జితసేవల తరహలోనే అమ్మవారి ఆలయంలో సేవా టికెట్లను జారీ చేయనున్నట్లు తెలిపారు. అలాగే ఆలయంలో నిర్వహిస్తున్న నిత్య పూజలు, వారపు సేవలు, వార్షిక సేవలు భక్తులకు అందుబాటులో వుండేందుకు ఈ-దర్శన్‌ కౌంటర్‌లలో లభ్యమయ్యెటట్లు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు తగిన విధంగా ఐ.టి. అప్లికేషన్‌ రూపొందించాలని సూచించారు. శ్రీ పద్మావతి అమ్మవారి సేవలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని తితిదే వెబ్‌సైట్‌లో వుంచాలన్నారు. అదేవిధంగా అమ్మవారి…

Read More

సహస్ర కలశాభిషేకం,v హనుమంత వాహనసేవ

సహస్ర కలశాభిషేకం,v హనుమంత వాహనసేవ

తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో గురువారం ఉదయం అమావాస్యను పురస్కరించుకుని సహస్రకలశాభిషేకం వైభవంగా జరిగింది. ఆలయంలో ఉదయం 6.00 నుండి 8.00 గంటల నడుమ సహస్ర కలశాభిషేకంసేవ వైభవంగా నిర్వహించారు. రాత్రి 7.00 నుంచి 9.00 గంటల వరకు హనుమంత వాహనసేవ వేడుకగా జరుగనుంది. సర్వాలంకార భూషితులైన శ్రీకోదండరామస్వామివారు తనకు ఎంతో ప్రీతిపాత్రమైన హనుమంత వాహనాన్ని అధిష్టించి ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. వైఖానస ఆగమం ప్రకారం వైష్ణవాలయాల్లో పౌర్ణమి, అమావాస్య, శుక్ల ఏకాదశి, కృష్ణ ఏకాదశి, శ్రవణం, పునర్వసు నక్షత్రాలకు చాలా విశిష్టత ఉంటుంది. ఈ కార్యక్రమంలో తితిదే డెప్యూటీ ఈవో శ్రీమతి బి.మునిలక్ష్మి, ఆలయ సూపరింటెండెంట్‌ శ్రీ ఉమామహేశ్వర్‌రెడ్డి, ఆలయ అర్చకులు, ఇతర అధికార ప్రముఖులు పాల్గొన్నారు.

Read More

ఎం.ఎస్‌.సుబ్బలక్ష్మి విగ్రహ పరిసరాలను సుందరీకరించండి : తితిదే ఈవో

ఎం.ఎస్‌.సుబ్బలక్ష్మి విగ్రహ పరిసరాలను సుందరీకరించండి : తితిదే ఈవో

తిరుపతిలోని పూర్ణకుంభం సర్కిల్‌ వద్ద గల ప్రఖ్యాత సంగీత విద్వాంసురాలు, గాయని శ్రీమతి ఎం.ఎస్‌.సుబ్బలక్ష్మి విగ్రహం పరిసరాలను సుందరీకరించాలని తితిదే ఈవో డా||డి.సాంబశివరావు బుధవారం ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు. శ్రీమతి ఎం.ఎస్‌.సుబ్బలక్ష్మి జయంతిని సెప్టెంబరు 16వ తేదీన జరుపుకుంటున్న విషయం విదితమే. ఈ సందర్భంగా విగ్రహం పరిసరాలను శుభ్రం చేసి, పెయింటింగ్‌ తదితర పనులు పూర్తి చేయాలని తితిదే చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీ చంద్రశేఖర్‌రెడ్డిని ఆదేశించారు. ఈ పనులను ఎస్వీ సంగీత కళాశాల ప్రిన్సిపాల్‌ పర్యవేక్షించాలని ఈవో సూచించారు.

Read More

సెప్టెంబరు 9న న్యూ డోనార్‌ మేనేజ్‌మెంట్‌ ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ సాఫ్ట్‌లాంచ్‌ :తితిదే ఈవో డా|| డి.సాంబశివరావు

సెప్టెంబరు 9న న్యూ డోనార్‌ మేనేజ్‌మెంట్‌ ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ సాఫ్ట్‌లాంచ్‌ :తితిదే ఈవో డా|| డి.సాంబశివరావు

సెప్టెంబరు 9వ తేదీన న్యూ డోనార్‌ మేనేజ్‌మెంట్‌ ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ను సాఫ్ట్‌లాంచ్‌ చేయనున్నట్టు తితిదే ఈవో డా|| డి.సాంబశివరావు తెలిపారు. తిరుపతిలోని తితిదే పరిపాలనా భవనంలో గల ఈవో కార్యాలయంలో బుధవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ తితిదేలోని 9 ట్రస్టులు, ఒక పథకానికి సంబంధించిన కార్యకలాపాలను నూతన అప్లికేషన్‌ ద్వారా నిర్వహించనున్నట్టు తెలిపారు. ఆన్‌లైన్‌ అప్లికేషన్‌పై అవగాహన కల్పించేందుకు సంబంధిత సిబ్బందికి రెండు రోజుల పాటు శిక్షణ ఇవ్వాలన్నారు. నూతన అప్లికేషన్‌లో ఆయా ట్రస్టులు, స్కీమ్‌ సమగ్ర వివరాలను ఆకట్టుకునేలా పొందుపరచాలని సూచించారు. విరాళం అందించిన 48 గంటల్లో డిజిటల్‌ పాసుపుస్తకం జనరేట్‌ చేయాలన్నారు. డిజిటల్‌ పాసు పుస్తకాలు వచ్చే వరకు పాత పాసు పుస్తకాలను కొనసాగించాలని సూచించారు. దాతలకు ప్రత్యేకంగా అందించే అన్ని సౌకర్యాలను తిరుమలలోని దాతల విభాగంలో అందుబాటులో…

Read More

భారతీయ సంస్కృతిని భావితరాలకు అందించాలి

భారతీయ సంస్కృతిని భావితరాలకు అందించాలి

తితిదే ప్రాజెక్టుల ప్రత్యేకాధికారి శ్రీ ఎన్‌.ముక్తేశ్వరరావు శ్రీ పద్మావతి డిగ్రీ కళాశాలలో ”శ్రీవైష్ణవ భక్తితత్వం”పై మహిళలతో 12 గంటల నిర్విరామ జాతీయ సదస్సు సనాతన ధర్మం, మానవీయ, నైతిక విలువలతో కూడిన భారతీయ సంస్కృతిని విద్యార్థిని విద్యార్థులు పాటించడంతోపాటు భావితరాలకు అందించాలని తితిదే ప్రాజెక్టుల ప్రత్యేకాధికారి శ్రీ ఎన్‌.ముక్తేశ్వరరావు కోరారు. తితిదే ఆళ్వార్‌ దివ్యప్రబంధ ప్రాజెక్టు, శ్రీపద్మావతి మహిళా డిగ్రీ, పిజి కళాశాల తెలుగు విభాగం సంయుక్త ఆధ్వర్యంలో ”శ్రీవైష్ణవ భక్తితత్వం” పేరిట తిరుపతిలోని శ్రీ పద్మావతి కళాశాలలో బుధవారం పూర్తిగా మహిళలతో 12 గంటల పాటు నిర్విరామ జాతీయ సదస్సు జరిగింది. ఈ కార్యక్రమాన్ని పరిశీలించేందుకు తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డు, వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డు ప్రతినిధులు విచ్చేయడం విశేషం. ఈ సదస్సు ప్రారంభోత్సవానికి ఆత్మీయ అతిథిగా విచ్చేసిన శ్రీ ఎన్‌.ముక్తేశ్వరరావు మాట్లాడుతూ శ్రీరామానుజ…

Read More

సెప్టెంబరు 12 నుండి 14వ తేదీ వరకు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు

సెప్టెంబరు 12 నుండి 14వ తేదీ వరకు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో సెప్టెంబరు 12 నుండి 14వ తేదీ వరకు పవిత్రోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. సెప్టెంబరు 11న అంకురార్పణంతో పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభంకానున్నాయి. సెప్టెంబరు 11వ తేదీన అంకురార్పణం సందర్భంగా సేనాధిపతి ఉత్సవం, మృత్సంగ్రహణం నిర్వహిస్తారు. సెప్టెంబరు 12న యాగశాలలో పవిత్రప్రతిష్ఠ, స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం, సాయంత్రం తిరువీధి ఉత్సవం జరుగుతాయి. సెప్టెంబరు 13న ఉదయం స్నపనతిరుమంజనం అనంతరం మూలవర్లకు, ఉత్సవర్లకు, విమాన ప్రాకారానికి, ధ్వజస్తంభానికి, మాడ వీధుల్లోని శ్రీమఠం ఆంజనేయస్వామి వారికి పవిత్రాలు సమర్పిస్తారు. సెప్టెంబరు 14న ఉదయం యాగశాలలో వైదిక కార్యక్రమాలు, స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. రాత్రి పూర్ణాహుతి తో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి. గృహస్తులు(ఇద్దరు) రూ.500/- టికెట్‌ కొనుగోలు చేసి ఈ పవిత్రోత్సవాల ఆర్జితసేవలో పాల్గొనవచ్చు.

Read More

సెప్టెంబరులో శ్రీ కోదండరామాలయంలో విశేష ఉత్సవాలు

సెప్టెంబరులో శ్రీ కోదండరామాలయంలో విశేష ఉత్సవాలు

తితిదేకి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో సెప్టెంబరు నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి. – సెప్టెంబరు 3, 10, 17, 24వ తేదీల్లో శనివారం సందర్భంగా ఉదయం 6.00 గంటలకు శ్రీసీతారామ లక్ష్మణుల మూలవర్ల అభిషేకం నిర్వహిస్తారు. భక్తులు రూ.20/- చెల్లించి మూలవర్ల అభిషేకంలో పాల్గొనవచ్చు. సాయంత్రం 6.00 గంటలకు స్వామి, అమ్మవారిని తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు, అనంతరం ఆలయంలో ఊంజల్‌సేవ నిర్వహిస్తారు. – సెప్టెంబరు 16న పౌర్ణమి సందర్భంగా ఉదయం 10.00 గంటలకు అష్టోత్తర శతకలశాభిషేకం నిర్వహిస్తారు. రూ.50/- చెల్లించి భక్తులు ఈ సేవలో పాల్గొనవచ్చు. సాయంత్రం 5.30 గంటలకు ఆలయ నాలుగు మాడ వీధుల నుంచి శ్రీరామచంద్ర పుష్కరిణి వరకు తిరుచ్చి ఉత్సవం నిర్వహిస్తారు. – సెప్టెంబరు 25న పునర్వసు…

Read More

తిరుపతి ప్రెస్ క్లబ్ మీడియా స్పోర్ట్స్ ముగింపు

తిరుపతి ప్రెస్ క్లబ్ మీడియా స్పోర్ట్స్ ముగింపు

తిరుపతి ప్రెస్ క్లబ్ మీడియా స్పోర్ట్స్ ముగింపు కార్యక్రమ౦ లొ మాట్లాడుతూన్న కార్యదర్శి కె.గిరిబాబు.పక్కన రాష్ట ఉపముఖ్యమ౦త్రి కె.ఈ.క్రిష్ణమూర్తి.ఎమ్.ఎల్.ఎ.సుగుణమ్మ.టిటిడి బొర్డుసభ్యులు జి.భానుప్రకాష్ రెడ్డి.డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్. పులిగొరు మురళి.డాక్టర్ సుధారాణి.తదితరులు

Read More

ఘనంగా అన్నమయ్య దినము ద్వాదశి

ఘనంగా అన్నమయ్య దినము ద్వాదశి

పరమపవిత్రమైన ద్వాదశి తిథినాడు పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారు శ్రీవారిలో ఐక్యమైన మహత్తర సందర్భాన్ని పురస్కరించుకుని తితిదే సోమవారం నాడు తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ‘అన్నమయ్య దినము ద్వాదశి’ని ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా మధ్యాహ్నం 1.00 గంటకు భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. అంతకుముందు ఉదయం 9.00 గంటలకు దినము ద్వాదశి సంకీర్తనలతో అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు గోష్ఠిగానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తితిదే ప్రాజెక్టుల డెప్యూటీ ఈవో శ్రీమతి శారద, ఏఈవో శ్రీమతి పద్మావతి, ఇతర అధికారులు, విశేషసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Read More

శ్రీవారి ఆలయ మాడ వీధుల్లో మొక్కలు నాటాలి

శ్రీవారి ఆలయ మాడ వీధుల్లో మొక్కలు నాటాలి

శ్రీవారి ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు ఆహ్లాదకరంగా ఉండేలా త్వరగా పెరిగే మొక్కలు నాటాలని టీటీడీ కార్యనిర్వహణాధికారి డా|| డి.సాంబశివరావు అధికారులను ఆదేశించారు.  భక్తులకు ఎండ వేడి నుంచి ఉపశమనం కల్పించేందుకు మాడవీధుల్లో స్ప్రింక్లర్లను ఏర్పాటుచేయాలని సూచించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో  సీనియర్‌ అధికారులతో ఈవో వారపు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ భక్తుల సౌలభ్యం కోసం ఆలయం ఎదురుగా ఉన్న పుస్తకవిక్రయశాల పక్కన ఏర్పాటుచేసిన బ్యాంక్‌ కౌంటర్‌లో బంగారం, వెండి, రాగి డాలర్ల విక్రయాలను త్వరితగతిన ప్రారంభించాలని సూచించారు. రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన కాంప్లెక్స్‌, కల్యాణకట్ట వద్ద శ్రీవారి సేవకుల చేత భక్తులకు తిరునామం పెట్టించే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నిర్మాణంలో ఉన్న దివ్యదర్శనం కాంప్లెక్స్‌ను సెప్టెంబరులో పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. కుటుంబ సభ్యులు తప్పిపోయిన…

Read More