సెప్టెంబరు 5వ తేదీ శ్రీకపిలేశ్వరాలయంలో వినాయక చవితి

సెప్టెంబరు 5వ తేదీ శ్రీకపిలేశ్వరాలయంలో వినాయక చవితి

తితిదేకి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరాలయంలో సెప్టెంబరు 5వ తేదీ సోమవారం వినాయక చవితి ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు జరగనున్నాయ. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, మూలవర్లకు అభిషేకం, అర్చన నిర్వహించనున్నారు. సాయంత్రం 6.00 నుండి 9.00 గంటల వరకు శ్రీ వినాయకస్వామివారు మూషికవాహనంపై ఊరేగి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

Read More

సెప్టెంబరు 14 నుండి 16వ తేదీ వరకు

సెప్టెంబరు 14 నుండి 16వ తేదీ వరకు

దేవుని కడప శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు తితిదే పరిధిలోని వైఎస్‌ఆర్‌ జిల్లా దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో సెప్టెంబరు 14 నుండి 16వ తేదీ వరకు పవిత్రోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. సెప్టెంబరు 13న సాయంత్రం 6.00 నుండి రాత్రి 9.00 గంటల వరకు విష్వక్సేనపూజ, అంకురార్పణంతో పవిత్రోత్సవాలు ప్రారంభమవుతాయ. వైదిక సంప్రదాయం ప్రకారం జాతాశౌచం, మృతాశౌచం వంటి వేళల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధం. అయినా యాత్రీకుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలిసీతెలియక ఇటువంటి దోషాలు జరుగుతుంటాయి. ఇలాంటి వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాదీ మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ పవిత్రోత్సవాలలో ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.

Read More

సహస్ర కలశాభిషేకం,v హనుమంత వాహనసేవ

సహస్ర కలశాభిషేకం,v హనుమంత వాహనసేవ

తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో గురువారం ఉదయం అమావాస్యను పురస్కరించుకుని సహస్రకలశాభిషేకం వైభవంగా జరిగింది. ఆలయంలో ఉదయం 6.00 నుండి 8.00 గంటల నడుమ సహస్ర కలశాభిషేకంసేవ వైభవంగా నిర్వహించారు. రాత్రి 7.00 నుంచి 9.00 గంటల వరకు హనుమంత వాహనసేవ వేడుకగా జరుగనుంది. సర్వాలంకార భూషితులైన శ్రీకోదండరామస్వామివారు తనకు ఎంతో ప్రీతిపాత్రమైన హనుమంత వాహనాన్ని అధిష్టించి ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. వైఖానస ఆగమం ప్రకారం వైష్ణవాలయాల్లో పౌర్ణమి, అమావాస్య, శుక్ల ఏకాదశి, కృష్ణ ఏకాదశి, శ్రవణం, పునర్వసు నక్షత్రాలకు చాలా విశిష్టత ఉంటుంది. ఈ కార్యక్రమంలో తితిదే డెప్యూటీ ఈవో శ్రీమతి బి.మునిలక్ష్మి, ఆలయ సూపరింటెండెంట్‌ శ్రీ ఉమామహేశ్వర్‌రెడ్డి, ఆలయ అర్చకులు, ఇతర అధికార ప్రముఖులు పాల్గొన్నారు.

Read More

శ్రీకోదండరామాలయంలో వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణం

శ్రీకోదండరామాలయంలో వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణం

తిరుపతిలోని శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో సోమవారం శ్రీ సీతారాముల కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. శ్రీరామచంద్రమూర్తి జన్మించిన పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రతినెలా కల్యాణం నిర్వహిస్తారు. ఇందులోభాగంగా ఆలయంలోని కల్యాణమండపంలో ఉదయం 11.00 గంటలకు కల్యాణోత్సవ ఘట్టం ప్రారంభమైంది. అర్చకులు వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా కల్యాణం నిర్వహించారు. కల్యాణోత్సవంలో పాల్గొన్న గృహస్తులకు ఉత్తరీయం, రవికె, అన్నప్రసాదం బహుమానంగా అందజేశారు. అనంతరం సాయంత్రం 5.30 గంటలకు శ్రీసీత లక్ష్మణ సమేత శ్రీకోదండరామస్వామివారి ఉత్సవమూర్తులను ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు. అక్కడినుంచి శ్రీరామచంద్ర పుష్కరిణికి తీసుకెళ్లి ఊంజల్‌సేవ చేపడతారు. ఈ కార్యక్రమంలో తితిదే స్థానికాలయాల డెప్యూటీ ఈవో శ్రీమతి మునిలక్ష్మి, సూపరింటెండెంట్‌ శ్రీ ఉమామహేశ్వర్‌రెడ్డి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ శేషారెడ్డి, పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Read More

సెప్టంబరు నెలలో తిరుమలలో జరుగు విశేష ఉత్సవాలు

సెప్టంబరు నెలలో తిరుమలలో జరుగు విశేష ఉత్సవాలు

నిత్యకల్యాణం పచ్చతోరణంగా భాసిల్లే తిమరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామివారికి సంవత్సరంలో అనేక ఉత్సవాలు జరుగుతాయనడం అతిశయోక్తికాదు. సెప్టంబరు నెలలో అనేక ముఖ్యమైన ఉత్సవాలు. సెప్టంబరు 4వ తేది శ్రీ వరాహ జయంతి. సెప్టంబరు 5వ తేది రెండు ఘాట్‌ రోడ్లలోని శ్రీ వినాయక స్వామివారి ఆలయాలలో వినాయక చవితి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సెప్టంబరు 15వ తేది శ్రీ అనంత పద్మనాభస్వామి వ్రతం. సెప్టంబరు 16వ తేది పౌర్ణమి సందర్భంగా శ్రీవారి గరుడసేవ. సెప్టంబరు 27వ తేది శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం.

Read More

శ్రీకపిలేశ్వరాలయంలో ఘనంగా లక్ష కుంకుమార్చన

శ్రీకపిలేశ్వరాలయంలో ఘనంగా లక్ష కుంకుమార్చన

తితిదేకి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరాలయంలో శ్రీ కామాక్షి అమ్మవారికి శుక్రవారం లక్ష కుంకుమార్చన ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం విఘ్నేశ్వరపూజ, పుణ్యాహవచనం, సంకల్పంతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 8.30 నుంచి 11.30 గంటల వరకు మొదటి విడత కుంకుమార్చన నిర్వహించారు. ఆ తరువాత నైవేద్యం, హారతి ఇచ్చారు. తిరిగి సాయంత్రం 4.00 నుంచి 6.00 గంటల వరకు రెండో విడత కుంకుమార్చన చేపట్టారు. అనంతరం నివేదన, దీపారాధన, హారతి, తీర్థప్రసాద వినియోగం చేశారు. సాయంత్రం 6.30 నుంచి రాత్రి 9.00 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను పురవీధుల్లో ఊరేగించనున్నారు. కుంకుమార్చనసేవలో పాల్గొన్న గృహస్తులకు ఒక లడ్డూ, కుంకుమ ప్రసాదం బహుమానంగా అందజేశారు. ఈ సందర్భంగా తితిదే అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భక్తి సంగీతం, దాససాహిత్య ప్రాజెక్టు…

Read More

తిరుమలలో ఘనంగా ఉట్లోత్సవం

తిరుమలలో ఘనంగా ఉట్లోత్సవం

తిరుమలలో శుక్రవారం ఉట్లోత్సవం అత్యంత ఘనంగా జరిగింది. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో గోకులాష్టమి ఆస్థానం నిర్వహించిన మరుసటిరోజు తిరుమలలో ఉట్లోత్సవాన్ని (శిక్యోత్సవం) నిర్వహించడం ఆనవాయితి. ఉట్లోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం ఆర్జితసేవలైన కల్యాణోత్సవం, ఊంజల్సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకారసేవలను తితిదే రద్దు చేసింది. ఈ ఉత్సవాన్ని తిలకించడానికి సాక్షాత్తు శ్రీ మలయప్పస్వామి బంగారు తిరుచ్చిపై, శ్రీకృష్ణస్వామి మరో తిరుచ్చిపై తిరువీధులలో ఊరేగుతూ వచ్చారు. ముందుగా ప్రాతఃకాలారాధనం, మధ్యాహ్నికారాధనం అయిన తరువాత ఈ ఉత్సవమూర్తులు ముందుగా పెద్దజీయంగార్ మఠానికి వేంచేయగా ఆరగింపు హారతి, బహుమాన నివేదనలు నిర్వహించారు. అనంతరం హథీరాంజీ మఠానికి, అటుపిమ్మట కర్ణాటక సత్రాలు వంటి ఇతర ప్రాంతాల్లో కూడా ఉత్సవర్లు కలియతిరుగుతూ ఉట్లోత్సవంలో పాల్గొన్నారు. శుక్రవారం మధ్యాహ్నం 1 గంటకు ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు ఆద్యంతం కోలాహలంగా సాగిన ఈ ఉట్లోత్సవంలో…

Read More

తిరుమలలో ఘనంగా శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు

తిరుమలలో ఘనంగా శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు

కలియుగ ప్రత్యక్షదైవమైన శ్రీ వేంకటేశ్వరస్వామియే సాక్షాత్తు ద్వాపర యుగపురుషుడైన శ్రీకృష్ణునిగా సంస్మరించుకొని తిరుమలలో గురువారంనాడు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గోగర్భం ఉద్యానవనంలో ః- మధ్యాహ్నం 12.00 గం||లకు తిరుమలలోని గోగర్భం ఉద్యానవనాలలో జన్మాష్టమి, ఉట్లోత్సవ వేడుకలను కన్నుల పండుగగా నిర్వహించారు. పుణ్యాహవచనం అనంతరం ఉద్యానవనాల్లో వెలసివున్న కాళీయమర్థనునికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అనంతరం గోక్షీరం, పెరుగు, తేనె, పరిమళం, చందనం ఇత్యాది ద్రవ్యాలతో అభిషేకాదులు నిర్వహించారు. ఆపై గోవర్థనునికి తలపాగా, ఉత్తరీయం, దోవతిలను ధరింపజేసి పూలమాలలతో శోభాయమానంగా అలంకరించారు. అనంతరం జరిగిన ఉట్లోత్సవం కార్యక్రమంలో యువకులు ఉత్సాహంతో పాల్గొని ఉట్లను పగులగొట్టారు. ఈ వేడుకలను తిలకించడానికి భక్తులు విశేషసంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం ప్రసాదవితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకల్లో తి.తి.దే ఉద్యానవనశాఖ ఉపసంచాలకులు శ్రీశ్రీనివాస్‌, ఉద్యానవనశాఖ సిబ్బంది తదితర అధికారులు పాల్గొన్నారు. శ్రీవారి ఆలయంలో…

Read More

భక్తుల భాగస్వామ్యంతో గోవులను రక్షించుకుందాం.. సంస్కృతిని కాపాడుకుందాం

భక్తుల భాగస్వామ్యంతో గోవులను రక్షించుకుందాం.. సంస్కృతిని కాపాడుకుందాం

తితిదే చైర్మన్‌ డా|| చదలవాడ కృష్ణమూర్తి దేశీయ గోవుల పరిశోధనా కేంద్రంగా ఎస్వీ గోశాల : తితిదే ఈవో డా|| డి.సాంబశివరావు మన వేదాలు, పురాణాల్లో పేర్కొన్న విధంగా సకల దేవతాస్వరూపాలైన గోవులను భక్తుల భాగస్వామ్యంతో రక్షించుకోవడం ద్వారా భారతీయ హైందవ సంస్కృతిని కాపాడుకుందామని తితిదే ధర్మకర్తల మండలి అధ్యక్షులు డా|| చదలవాడ కృష్ణమూర్తి ఉద్ఘాటించారు. తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర గోసంరక్షణశాలలో గురువారం గోకులాష్టమి వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తితిదే ఛైర్మన్‌ మాట్లాడుతూ భారతీయ హైందవ సంప్రదాయంలో గోవులకు విశేషమైన స్థానం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ గోవును ఆరాధించి, ఆశీర్వాదం అందుకోవాలని కోరారు. హిందూ ధర్మంలోని పూజావిధానాలను, నేడు మనకున్న వనరులను రాబోవు తరాలవారికి అందించాలని సూచించారు. పలమనేరు వద్ద 450 ఎకరాలలో అత్యాధునిక గోశాలను తితిదే ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేశారు….

Read More

పూర్ణాహుతితో ఘనంగా ముగిసిన పవిత్రోత్సవాలు

పూర్ణాహుతితో ఘనంగా ముగిసిన పవిత్రోత్సవాలు

తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రావణమాసంలో ప్రతి ఏటా మూడురోజులపాటు నిర్వహించే పవిత్రోత్సవాలు మంగళవారంనాడు పవిత్ర పూర్ణాహుతితో ఘనంగా ముగిశాయి. తొలి రెండురోజుల్లాగానే మంగళవారం ఉదయం కూడా యాగశాలలో ఋత్వికులు హోమాలు నిర్వహించారు. తరువాత ఉదయం 9.00 గం||ల నుండి 11.00 గం||ల నడుమ ఉత్సవమూర్తులకు వరుసగా  గోక్షీరము, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్ళు, పసుపుతో అభిషేకించి చివరగా చందన పూత పూశారు. ధూపదీప హారతులు నివేదించారు. దీంతో స్నపనతిరుమంజన కార్యక్రమం శాస్త్రోక్తంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీఎ.వి.రమణ, శ్రీ భానుప్రకాష్‌రెడ్డి, శ్రీ అరికెల నర్సారెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీకోదండరామారావు, పేష్కార్‌ శ్రీ సెల్వం తదితరులు పాల్గొన్నారు.

Read More