సెప్టెంబరు 9న న్యూ డోనార్‌ మేనేజ్‌మెంట్‌ ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ సాఫ్ట్‌లాంచ్‌ :తితిదే ఈవో డా|| డి.సాంబశివరావుసెప్టెంబరు 9వ తేదీన న్యూ డోనార్‌ మేనేజ్‌మెంట్‌ ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ను సాఫ్ట్‌లాంచ్‌ చేయనున్నట్టు తితిదే ఈవో డా|| డి.సాంబశివరావు తెలిపారు. తిరుపతిలోని తితిదే పరిపాలనా భవనంలో గల ఈవో కార్యాలయంలో బుధవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ తితిదేలోని 9 ట్రస్టులు, ఒక పథకానికి సంబంధించిన కార్యకలాపాలను నూతన అప్లికేషన్‌ ద్వారా నిర్వహించనున్నట్టు తెలిపారు. ఆన్‌లైన్‌ అప్లికేషన్‌పై అవగాహన కల్పించేందుకు సంబంధిత సిబ్బందికి రెండు రోజుల పాటు శిక్షణ ఇవ్వాలన్నారు. నూతన అప్లికేషన్‌లో ఆయా ట్రస్టులు, స్కీమ్‌ సమగ్ర వివరాలను ఆకట్టుకునేలా పొందుపరచాలని సూచించారు. విరాళం అందించిన 48 గంటల్లో డిజిటల్‌ పాసుపుస్తకం జనరేట్‌ చేయాలన్నారు. డిజిటల్‌ పాసు పుస్తకాలు వచ్చే వరకు పాత పాసు పుస్తకాలను కొనసాగించాలని సూచించారు. దాతలకు ప్రత్యేకంగా అందించే అన్ని సౌకర్యాలను తిరుమలలోని దాతల విభాగంలో అందుబాటులో ఉంచుకోవాలని ఈవో ఆదేశించారు.

ఈ సమావేశంలో తితిదే తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌, న్యాయాధికారి శ్రీ వెంకటరమణ, స్విమ్స్‌ సంచాలకులు డాక్లర్‌ రవికుమార్‌, బర్డ్‌ సంచాలకులు డాక్టర్‌ జగదీష్‌, చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీచంద్రశేఖర్‌రెడ్డి, ఎఫ్‌ఏ, సిఏవో శ్రీ బాలాజి, ఐటి విభాగాధిపతి శ్రీ శేషారెడ్డి, చీఫ్‌ ఇన్‌ఫర్మేషన్‌ ఆఫీసర్‌ శ్రీ సుధాకర్‌, దాతల విభాగం డెప్యూటీ ఈవో శ్రీరాజేంద్రుడు, టిసిఎస్‌ అధికారులు శ్రీభీమశేఖర్‌, శ్రీ సత్య ఇతర అధికారులు పాల్గొన్నారు.Related posts

Leave a Comment