ఎం.ఎస్‌.సుబ్బలక్ష్మి విగ్రహ పరిసరాలను సుందరీకరించండి : తితిదే ఈవో



తిరుపతిలోని పూర్ణకుంభం సర్కిల్‌ వద్ద గల ప్రఖ్యాత సంగీత విద్వాంసురాలు, గాయని శ్రీమతి ఎం.ఎస్‌.సుబ్బలక్ష్మి విగ్రహం పరిసరాలను సుందరీకరించాలని తితిదే ఈవో డా||డి.సాంబశివరావు బుధవారం ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు.

శ్రీమతి ఎం.ఎస్‌.సుబ్బలక్ష్మి జయంతిని సెప్టెంబరు 16వ తేదీన జరుపుకుంటున్న విషయం విదితమే. ఈ సందర్భంగా విగ్రహం పరిసరాలను శుభ్రం చేసి, పెయింటింగ్‌ తదితర పనులు పూర్తి చేయాలని తితిదే చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీ చంద్రశేఖర్‌రెడ్డిని ఆదేశించారు. ఈ పనులను ఎస్వీ సంగీత కళాశాల ప్రిన్సిపాల్‌ పర్యవేక్షించాలని ఈవో సూచించారు.



Related posts

Leave a Comment