భారతీయ సంస్కృతిని భావితరాలకు అందించాలి

భారతీయ సంస్కృతిని భావితరాలకు అందించాలి

తితిదే ప్రాజెక్టుల ప్రత్యేకాధికారి శ్రీ ఎన్‌.ముక్తేశ్వరరావు శ్రీ పద్మావతి డిగ్రీ కళాశాలలో ”శ్రీవైష్ణవ భక్తితత్వం”పై మహిళలతో 12 గంటల నిర్విరామ జాతీయ సదస్సు సనాతన ధర్మం, మానవీయ, నైతిక విలువలతో కూడిన భారతీయ సంస్కృతిని విద్యార్థిని విద్యార్థులు పాటించడంతోపాటు భావితరాలకు అందించాలని తితిదే ప్రాజెక్టుల ప్రత్యేకాధికారి శ్రీ ఎన్‌.ముక్తేశ్వరరావు కోరారు. తితిదే ఆళ్వార్‌ దివ్యప్రబంధ ప్రాజెక్టు, శ్రీపద్మావతి మహిళా డిగ్రీ, పిజి కళాశాల తెలుగు విభాగం సంయుక్త ఆధ్వర్యంలో ”శ్రీవైష్ణవ భక్తితత్వం” పేరిట తిరుపతిలోని శ్రీ పద్మావతి కళాశాలలో బుధవారం పూర్తిగా మహిళలతో 12 గంటల పాటు నిర్విరామ జాతీయ సదస్సు జరిగింది. ఈ కార్యక్రమాన్ని పరిశీలించేందుకు తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డు, వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డు ప్రతినిధులు విచ్చేయడం విశేషం. ఈ సదస్సు ప్రారంభోత్సవానికి ఆత్మీయ అతిథిగా విచ్చేసిన శ్రీ ఎన్‌.ముక్తేశ్వరరావు మాట్లాడుతూ శ్రీరామానుజ…

Read More

సెప్టెంబరు 2న డయల్‌ యువర్‌ ఇ.ఓ

సెప్టెంబరు 2న డయల్‌ యువర్‌ ఇ.ఓ

ప్రతినెలా మొదటి శుక్రవారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో నిర్వహించే డయల్‌ యువర్‌ ఇ.ఓ కార్యక్రమం సెప్టెంబరు 2వ తేదీ ఉదయం 8.30 గం||ల నుండి 9.30 గం||ల నడుమ జరుగనుంది. ఈ కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను తి.తి.దే కార్యనిర్వహణాధికారి డా||డి.సాంబశివరావు గారికి ఫోన్‌ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చు. అందుకు భక్తులు సంప్రదించవలసిన నెంబరు. 0877-2263261.

Read More