సెప్టెంబరు 12 నుండి 14వ తేదీ వరకు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు

సెప్టెంబరు 12 నుండి 14వ తేదీ వరకు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో సెప్టెంబరు 12 నుండి 14వ తేదీ వరకు పవిత్రోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. సెప్టెంబరు 11న అంకురార్పణంతో పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభంకానున్నాయి. సెప్టెంబరు 11వ తేదీన అంకురార్పణం సందర్భంగా సేనాధిపతి ఉత్సవం, మృత్సంగ్రహణం నిర్వహిస్తారు. సెప్టెంబరు 12న యాగశాలలో పవిత్రప్రతిష్ఠ, స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం, సాయంత్రం తిరువీధి ఉత్సవం జరుగుతాయి. సెప్టెంబరు 13న ఉదయం స్నపనతిరుమంజనం అనంతరం మూలవర్లకు, ఉత్సవర్లకు, విమాన ప్రాకారానికి, ధ్వజస్తంభానికి, మాడ వీధుల్లోని శ్రీమఠం ఆంజనేయస్వామి వారికి పవిత్రాలు సమర్పిస్తారు. సెప్టెంబరు 14న ఉదయం యాగశాలలో వైదిక కార్యక్రమాలు, స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. రాత్రి పూర్ణాహుతి తో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి. గృహస్తులు(ఇద్దరు) రూ.500/- టికెట్‌ కొనుగోలు చేసి ఈ పవిత్రోత్సవాల ఆర్జితసేవలో పాల్గొనవచ్చు.

Read More

సెప్టెంబరులో శ్రీ కోదండరామాలయంలో విశేష ఉత్సవాలు

సెప్టెంబరులో శ్రీ కోదండరామాలయంలో విశేష ఉత్సవాలు

తితిదేకి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో సెప్టెంబరు నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి. – సెప్టెంబరు 3, 10, 17, 24వ తేదీల్లో శనివారం సందర్భంగా ఉదయం 6.00 గంటలకు శ్రీసీతారామ లక్ష్మణుల మూలవర్ల అభిషేకం నిర్వహిస్తారు. భక్తులు రూ.20/- చెల్లించి మూలవర్ల అభిషేకంలో పాల్గొనవచ్చు. సాయంత్రం 6.00 గంటలకు స్వామి, అమ్మవారిని తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు, అనంతరం ఆలయంలో ఊంజల్‌సేవ నిర్వహిస్తారు. – సెప్టెంబరు 16న పౌర్ణమి సందర్భంగా ఉదయం 10.00 గంటలకు అష్టోత్తర శతకలశాభిషేకం నిర్వహిస్తారు. రూ.50/- చెల్లించి భక్తులు ఈ సేవలో పాల్గొనవచ్చు. సాయంత్రం 5.30 గంటలకు ఆలయ నాలుగు మాడ వీధుల నుంచి శ్రీరామచంద్ర పుష్కరిణి వరకు తిరుచ్చి ఉత్సవం నిర్వహిస్తారు. – సెప్టెంబరు 25న పునర్వసు…

Read More

తిరుపతి ప్రెస్ క్లబ్ మీడియా స్పోర్ట్స్ ముగింపు

తిరుపతి ప్రెస్ క్లబ్ మీడియా స్పోర్ట్స్ ముగింపు

తిరుపతి ప్రెస్ క్లబ్ మీడియా స్పోర్ట్స్ ముగింపు కార్యక్రమ౦ లొ మాట్లాడుతూన్న కార్యదర్శి కె.గిరిబాబు.పక్కన రాష్ట ఉపముఖ్యమ౦త్రి కె.ఈ.క్రిష్ణమూర్తి.ఎమ్.ఎల్.ఎ.సుగుణమ్మ.టిటిడి బొర్డుసభ్యులు జి.భానుప్రకాష్ రెడ్డి.డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్. పులిగొరు మురళి.డాక్టర్ సుధారాణి.తదితరులు

Read More