ఘనంగా అన్నమయ్య దినము ద్వాదశిపరమపవిత్రమైన ద్వాదశి తిథినాడు పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారు శ్రీవారిలో ఐక్యమైన మహత్తర సందర్భాన్ని పురస్కరించుకుని తితిదే సోమవారం నాడు తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ‘అన్నమయ్య దినము ద్వాదశి’ని ఘనంగా నిర్వహించింది.

ఈ సందర్భంగా మధ్యాహ్నం 1.00 గంటకు భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. అంతకుముందు ఉదయం 9.00 గంటలకు దినము ద్వాదశి సంకీర్తనలతో అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు గోష్ఠిగానం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో తితిదే ప్రాజెక్టుల డెప్యూటీ ఈవో శ్రీమతి శారద, ఏఈవో శ్రీమతి పద్మావతి, ఇతర అధికారులు, విశేషసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.Related posts

Leave a Comment