శ్రీవారి ఆలయ మాడ వీధుల్లో మొక్కలు నాటాలి

TTD WED 1



శ్రీవారి ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు ఆహ్లాదకరంగా ఉండేలా త్వరగా పెరిగే మొక్కలు నాటాలని టీటీడీ కార్యనిర్వహణాధికారి డా|| డి.సాంబశివరావు అధికారులను ఆదేశించారు.  భక్తులకు ఎండ వేడి నుంచి ఉపశమనం కల్పించేందుకు మాడవీధుల్లో స్ప్రింక్లర్లను ఏర్పాటుచేయాలని సూచించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో  సీనియర్‌ అధికారులతో ఈవో వారపు సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ భక్తుల సౌలభ్యం కోసం ఆలయం ఎదురుగా ఉన్న పుస్తకవిక్రయశాల పక్కన ఏర్పాటుచేసిన బ్యాంక్‌ కౌంటర్‌లో బంగారం, వెండి, రాగి డాలర్ల విక్రయాలను త్వరితగతిన ప్రారంభించాలని సూచించారు. రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన కాంప్లెక్స్‌, కల్యాణకట్ట వద్ద శ్రీవారి సేవకుల చేత భక్తులకు తిరునామం పెట్టించే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నిర్మాణంలో ఉన్న దివ్యదర్శనం కాంప్లెక్స్‌ను సెప్టెంబరులో పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. కుటుంబ సభ్యులు తప్పిపోయిన భక్తుల సౌకర్యార్థం ఆలయానికి అభిముఖంగా సులువుగా గుర్తించేలా లాస్ట్‌ అండ్‌ ఫౌండ్‌ సెంటర్‌ను నిర్మించాలని ఈవో ఆదేశించారు.

ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌లోని నిపుణులతో మాన్యువల్స్‌ రూపొందించి  పరకామణి విభాగాన్ని మరింత పఠిష్టం చేయాలని ఈవో ఆదేశించారు. పరకామణిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసి, నాణేలను వేరు చేయాలని సూచించారు. వచ్చే నెలలో మరోసారి ట్రయల్‌ పరకామణి  నిర్వహించి అధ్యయనం చేయనున్నట్టు తెలిపారు. కల్యాణకట్ట, అన్నప్రసాద భవనంలో పాదరక్షలు భద్రపరుచుకునేందుకు ర్యాక్‌లు ఏర్పాటుచేయాలన్నారు. అన్నప్రసాద భవనంలో బఫె భోజనం చేసే ఏర్పాటు ఉందని భక్తులందరికీ తెలిసేలా సూచికబోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. పిఎసి-1, పిఎసి-2, పిఎసి-3, పిఎసి-4 పేర్లను ఎక్కువ మంది భక్తులకు అర్థమయ్యేలా ప్రదర్శనబోర్డులు ఏర్పాటుచేయాలన్నారు.

పిఎసి-4, జిఎన్‌సి టోల్‌గేట్‌ వద్ద గల లగేజి కౌంటర్లలో భక్తులకు ఇబ్బందిలేకుండా లగేజి అందేలా చర్యలు తీసుకోవాలని ఈవో ఆదేశించారు. తిరుపతిలోని ఐఐటి విద్యార్థుల ద్వారా సర్వే చేయించి లగేజి కౌంటర్ల నిర్వహణ, భక్తుల సంతృప్తి తదితర విషయాలపై ఫీడ్‌బ్యాక్‌ తీసుకోవాలన్నారు. సేవా సదన్‌, ఇతర ముఖ్యమైన సిసి టివిలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో టీటీడీ న్యాయాధికారి శ్రీ వెంకటరమణ, చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీ చంద్రశేఖర్‌రెడ్డి, అదనపు ఎఫ్‌ఏ,సిఏవో శ్రీ బాలాజి, ఎస్‌ఇ-2 శ్రీ రామచంద్రారెడ్డి, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ కోదండరామారావు, ముఖ్య భద్రతాధికారి శ్రీ రవీంద్రారెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.

TTD WED 1

orugunda suresh
Orugunda Suresh
Sr Reporter

Orugunda Suresh is an electronic media journalist with eight plus years of experience. He excels in visual communication and has worked as correspondent for premier media organisations such as Maa TV, Mahaa TV,  TV9 Network, ETV Network(TV18 Group), Studio N. He contributes news stories and features  to thirupatinews.com from Tirumala and Tirupati.



Related posts

Leave a Comment