ఆగస్టు 25న ఎస్వీ గోసంరక్షణశాలలో గోకులాష్టమి వేడుకలు

ఆగస్టు 25న ఎస్వీ గోసంరక్షణశాలలో గోకులాష్టమి వేడుకలు

టీటీడీ శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాల, శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణ ట్రస్టు ఆధ్వర్యంలో ఆగస్టు 25వ తేదీన గోకులాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా గోసంరక్షణశాలలో గోపూజ, సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టనున్నారు. శ్రీకృష్ణ భగవానుని జన్మదిన మహోత్సవాన్ని గోకులాష్టమిగా నిర్వహించడం హైందవ సంప్రదాయం. సనాతన హిందూ ధర్మ ప్రచారమే ప్రధాన లక్ష్యంగా స్వీకరించిన టీటీడీ హిందువుల అతిముఖ్యమైన పండుగలలో ఒకటైన జన్మాష్టమి వేడుకలను తిరుపతిలో ప్రతి ఏడాదీ అత్యంత ఘనంగా నిర్వహిస్తుంది. సాక్షాత్తు శ్రీ కృష్ణగోలోకాన్ని తలపించే విధంగా టీటీడీ శ్రీవేంకటేశ్వర గోశాలలో ఏర్పాట్లను చేయనుంది. భారీగా పందిళ్ళు, మామిడితోరణాలు, పూమాలలతో అలంకారాలు చేపట్టనుంది. గోశాలలోని గోసంపదను అందంగా అలంకరించి భూలోక గోకులంగా తీర్చిదిద్దేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడాది కూడా సందర్శకులు గోశాలలో బెల్లం, బియ్యం, పశుగ్రాసాన్ని భక్తులు స్వయంగా పశువులకు తినిపించే అవకాశాన్ని టీటీడీ…

Read More

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు 12న వరలక్ష్మీ వ్రతం

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు 12న వరలక్ష్మీ వ్రతం

సిరుల తల్లి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు 12వ తేదీ వరలక్ష్మీ వ్రతం వైభవంగా జరుగనుంది. వరలక్ష్మీ వ్రతానికి సంబందించి ఆగష్టుౖ 11వ తేదీ గురువారం ఉదయం 10.00 గంటల నుండి ఆలయం ఎదురుగా వున్న కుంకుమార్చన కౌంటర్లలో కరెంట్‌ బుకింగ్‌లో భక్తులు ఈ టికెట్లు పొందవచ్చు. ముందు వచ్చిన వారికి ముందు ప్రాతిపదికన ఒకరికి ఒక్క టికెటు మాత్రమే కేటాయిస్తారు. భక్తులు తమ ఐడి కార్డు జిరాక్స్‌ను తప్పక జత చేయవలేను. ఇందుకోసం 200 టికెట్లు భక్తులకు అందుబాటులో ఉంచారు. వరలక్ష్మీ వ్రతంలో పాల్గొనదలచిన భక్తులు(ఇద్దరు) రూ.500/- చెల్లించి పాల్గొనవచ్చును. వీరికి ఒక అంగవస్త్రం, ఒక రవిక, ఒక్క లడ్డూ, ఒక్క వడ బహుమానంగా ఇస్తారు. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. సాయంత్రం భక్తుల భజనలు, కోలాటాల నడుమ…

Read More

వరుస సెలవుల సందర్భంగా తిరుమలకు విచ్చేసే భక్తులకు ముందస్తు ఏర్పాట్లు

వరుస సెలవుల సందర్భంగా  తిరుమలకు విచ్చేసే భక్తులకు ముందస్తు ఏర్పాట్లు

ఆగష్టు 12 నుండి 15వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు వరుస సెలవులు వస్తున్న సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు విచ్చేసే అవకాశం ఉన్నందున వారికి ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని టీటీడీ కార్యనిర్వహణాధికారి డా|| డి.సాంబశివరావు అధికారులను ఆదేశించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో మంగళవారంనాడు జరిగిన సీనియర్‌ అధికారులు సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నాలుగు రోజులు వరుస సెలవులకు కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు త్వరిత గతిన దర్శనం, వసతికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. భక్తులకు అవసరమైనన్ని లడ్లు ముందస్తుగా నిల్వ ఉంచుకోవాలని సూచించారు. తిరుమల రిసెష్పన్‌.1 పరిధిలోని 64 డోనార్‌ వసతి గృహాల్లోగల 754 గదులకు భక్తుల సౌకర్యార్థం  ఆగష్టు 15వ తేదీ నుండి కాషన్‌ డిపాజిట్‌ రద్దు…

Read More