శ్రీవారి జన్మనక్షత్రం చరిత్ర

శ్రీవారి జన్మనక్షత్రం చరిత్ర

న నక్షత్రమండలమైన పాలపుంత విష్ణుచక్రాకారంలో వుంటుంది. ఈ చక్రాకారం యొక్క ఒక అంచులోనిదే సూర్యమండలం. మన సూయునివంటి కోట్లాది నక్షత్రాలతో కూడినదే పాలపుంత. ఇందులో మధ్యన ఉన్న మకరరాశిలోని శ్రవణా నక్షత్రం నుండి విష్ణువు భూలోకానికి దిగివచ్చినట్టు పురాణాలు చెపుతున్నాయి. అందుకే స్వామివారి జన్మనక్షత్రం శ్రవణంగా జరుపుకుంటున్నాము. వేయి సూర్యులకాంతిలో ప్రకాశించే దివ్య త్రిదశవిమానంలో సిద్ధ సాధ్య కిన్నెరా కింపురుష గరుడ గంధర్వ అప్సరోగణాలతో పరివేష్టించబడి స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా వచ్చినట్టు శ్రీవారి ఆవిర్భావఘట్టంలో వర్ణించబడివున్నది. ఆ దివ్యవిమానం యొక్క ప్రతిరూపమే నేటి ఆనందనిలయ విమానం. ఆ దివ్యవిమానం ఇప్పటికీ సామాన్య మానవుల దృష్టికి అదృశ్యంగా నారాయణగిరి సానువులలో నిక్షిప్తమై వున్నట్లు కూడా చెప్పబడింది. > శ్రీ వెంతకేశ్వర స్వామివారి దివ్యమంగళ సాలగ్రామ శిలా స్వరూపం సుమారు 9 1/2 అడుగుల ఎత్తు వుంటుంది. శ్రీవారికి…

Read More