దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఘనంగా ప్రారంభమైన బాలాలయ జీర్ణోద్ధరణ

TTD



టీటీడీకి అనుబంధంగా ఉన్న వై.యస్‌.ఆర్‌.కడప జిల్లా దేవుని కడపలో గల శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో గురువారం బాలాలయ జీర్ణోద్ధరణ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆలయంలోని శ్రీ ఆండాళ్‌ అమ్మవారి సన్నిధి, శ్రీ విష్వక్సెేన సన్నిధి, ధ్వజస్తంభ జీర్ణోద్ధరణ కార్యక్రమాలు జరుగనున్నాయ.

ఆగస్టు 4వ తేదీ గురువారం సాయంత్రం 6.00 నుండి 9.00 గంటల వరకు విష్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, వాస్తుపూజ, అంకురార్పణంతో బాలాలయ జీర్ణోద్ధరణ ప్రారంభంకానుంది. ఆగష్టు 5వ తేదీ ఉదయం 9.00 నుంచి 1.00 గంటల వరకు బాలభోగము, చతుష్టానార్చన, మండల కుంభ ఆరాధన నిర్వహించనున్నారు. ఆగష్టు 6వ తేదీ ఉదయం 6.00 నుండి మధ్యాహ్నం 1.00 గంటల వరకు నిత్య హోమాలు, సాయంత్రం 6.00 నుండి రాత్రి 9.00 గంటల వరకు సయమరాధన హోమాలు, నివేదన, తీర్థగోష్టి జరుగనుంది. ఆగస్టు 7న ఉదయం 5.00 నుండి మధ్యాహ్నం 1.00 గంటల వరకు మహాపూర్ణాహుతి, నివేదన, బలిహరణ, కలపకర్షణ కుంభప్రోక్షణ, శాత్తుమోర నిర్వహిస్తారు.

orugunda suresh
Orugunda Suresh
Sr Reporter

Orugunda Suresh is an electronic media journalist with eight plus years of experience. He excels in visual communication and has worked as correspondent for premier media organisations such as Maa TV, Mahaa TV,  TV9 Network, ETV Network(TV18 Group), Studio N. He contributes news stories and features  to thirupatinews.com from Tirumala and Tirupati.



Related posts

Leave a Comment