దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఘనంగా ప్రారంభమైన బాలాలయ జీర్ణోద్ధరణ

దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఘనంగా ప్రారంభమైన బాలాలయ జీర్ణోద్ధరణ

టీటీడీకి అనుబంధంగా ఉన్న వై.యస్‌.ఆర్‌.కడప జిల్లా దేవుని కడపలో గల శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో గురువారం బాలాలయ జీర్ణోద్ధరణ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆలయంలోని శ్రీ ఆండాళ్‌ అమ్మవారి సన్నిధి, శ్రీ విష్వక్సెేన సన్నిధి, ధ్వజస్తంభ జీర్ణోద్ధరణ కార్యక్రమాలు జరుగనున్నాయ. ఆగస్టు 4వ తేదీ గురువారం సాయంత్రం 6.00 నుండి 9.00 గంటల వరకు విష్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, వాస్తుపూజ, అంకురార్పణంతో బాలాలయ జీర్ణోద్ధరణ ప్రారంభంకానుంది. ఆగష్టు 5వ తేదీ ఉదయం 9.00 నుంచి 1.00 గంటల వరకు బాలభోగము, చతుష్టానార్చన, మండల కుంభ ఆరాధన నిర్వహించనున్నారు. ఆగష్టు 6వ తేదీ ఉదయం 6.00 నుండి మధ్యాహ్నం 1.00 గంటల వరకు నిత్య హోమాలు, సాయంత్రం 6.00 నుండి రాత్రి 9.00 గంటల వరకు సయమరాధన హోమాలు, నివేదన, తీర్థగోష్టి జరుగనుంది….

Read More

టీటీడీ ప్రధాన ఆశయాల్లో శేషాచల పర్యావరణ పరిరక్షణం ప్రథమం – టీటీడీ  ఛైర్మెన్‌

టీటీడీ ప్రధాన ఆశయాల్లో శేషాచల పర్యావరణ పరిరక్షణం ప్రథమం – టీటీడీ  ఛైర్మెన్‌

తిరుమల శేషాచలం అడవులు పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ముందుకు సాగుతున్న టీటీడీ. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వనం మనం కార్యక్రమం పిలుపు మేరకు శుక్రవారం నాడు తిరుమలలోని శ్రీగంధం వనంలో మొక్కలు నాటడంలో ఉద్యోగులను, శ్రీవారి సేవకులను భాగస్వామ్యంతో మొక్కలు నాటే బృహత్కార్యక్రమాన్ని చేపట్టిందని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు డాక్టర్‌ చదలవాడ క్రిష్ణమూర్తి అన్నారు.   శుక్రవారం నాడు తిరుమల పార్వేట మండపం సమీపంలో ఉన్న శ్రీగంధ వనంలో ”వనం-మనం” కార్యక్రమంలో భాగంగా టీటీడీ ఈవో డాక్టర్‌ డి.సాంబశివరావు, తిరుమల జెఇఓ శ్రీ కె.ఎస్‌. శ్రీనివాసరాజులతో కూడి శ్రీగంధం మొక్కలు నాటే కార్యక్రమంలో టీటీడీ ట్రస్ట్‌బోర్డు ఛైర్మెన్‌ పాల్గొన్నారు.   అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ చెట్లునాటే బృహత్తర కార్యక్రమాన్ని టీటీడీ గత ఎన్నో దశాబ్దాలుగా నిర్వహిస్తూ పర్యావరణ పరిరక్షణలో తమవంతు ధర్మాన్ని నిర్వహిస్తున్నదన్నారు. తిరుమల…

Read More