తిరుమలలో ఘనంగా ప్రారంభమైన శ్రీ జయతీర్ధుల ఆరాధనోత్సవాలు

02ad5554-924f-4ea5-aa35-f1c9430776ff



కలియుగ వైకుంఠం తిరుమలలో శ్రీ జయతీర్ధుల ఆరాధనోత్సవాలు టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో శనివారం ఉదయం ఆస్థానమండపంలో ఘనంగా ప్రారంభమెనవి. ఇందులో భాగంగా ఉదయం 5.30 నుండి 7.00 గంటల వరకు దాససాహిత్యప్రాజెక్టు కళాకారులతో సుప్రభాతం, ధ్యానం నిర్వహించారు.

అనంతరం ఉడిపిలోని పలిమారు మఠముకు చెందిన శ్రీ విద్యాధీశ తీర్ధ స్వామీజీ తమ మంగళా శాసనములో ద్వైతసిద్ధాంత ప్రతిష్ఠాపనాచార్యులు జగద్గురు శ్రీ మధ్వాచార్యులు భగవంతుని చేరుటకు భక్తి ఒక్కటే మార్గం అని బోధించారని, ఆసేతు హిమాచలం సంచరించి శిష్యులకు సత్‌ సిద్ధాంతమును ప్రచారము చేస్తూ 37 గ్రంథాలకు పైగా రచించారని తెలిపారు. శ్రీజయతీర్ధులవారు ఈ గ్రంథములకు వ్యాఖ్యానం వ్రాసి టీకాచార్యులని ప్రసిద్ధి పొందినట్లు తెలిపారు. వీరి సాహిత్యమును శ్రీ పురంధరదాసులు గ్రహించి అపార కీర్తనలు రచించినట్లు వివరించారు.

పిదప ఉడిపిలోని అదమారు మఠము శ్రీ ఈశప్రియ తీర్థ స్వామిజీ మంగళా తమ శాసనాములో ఆషాడమాసంలో శుభకార్యాలు చేయకుడదని అన్నారు, కాని భక్తి, వైరాగ్య, ధ్యానములకు ఆషాడమాసం చాలా విశిష్టమైనదని వివరించారు. ఆషాఢమాసంలో మహానీయులు చాతుర్మాస దీక్ష చేస్తారని, తద్వారా ధర్మ ప్రచారం, లోక కల్యాణం జరుగుతుందని తెలిపారు. చాతుర్మాస దీక్షలకు హైందవ సనాతన వైదిక ధర్మంలో ఎంతో ప్రాముఖ్యత ఉన్నట్లు వివరించారు.

6a1ec451-245c-48c3-8a71-15961d18a46e

కాగా శనివారం ఉదయం 8.30 నుంచి 10.00 గంటల వరకు దాస సాహిత్య కళాకారులతో ”శ్రీజయతీర్ధుల సంకీర్తన”, ఉదయం 10.30 నుండి 12.30 గంటల వరకు పండితులతో ఆధ్యాత్మిక – ధార్మిక సందేశ కార్యక్రమాలు జరిగాయ. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నామసంకీర్తన-సంగీత విభావరి కార్యక్రమాలు జరిగాయ. సాయంత్రం 6.00 నుండి 8.00 గంటల వరకు సామూహిక భజన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

కాగా జులై 24వ తేదీన ఉదయం 7.00 గంటలకు శ్రీవారి ఆలయ నాలుగు మాడ వీధుల్లో 3000 మంది దాస సాహిత్య భజన సభ్యులతో నగర సంకీర్తన వైభవంగా నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీపి.ఆర్‌.ఆనందతీర్థాచార్యలు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

orugunda suresh
Orugunda Suresh
Sr Reporter

Orugunda Suresh is an electronic media journalist with eight plus years of experience. He excels in visual communication and has worked as correspondent for premier media organisations such as Maa TV, Mahaa TV,  TV9 Network, ETV Network(TV18 Group), Studio N. He contributes news stories and features  to thirupatinews.com from Tirumala and Tirupati.



Related posts

Leave a Comment