త్వరలో సర్వదర్శనం భక్తులకు మరింత మెరుగైన వసతులు : టీటీడీ ఈవో డా|| డి.సాంబశివరావు

5cf730c1-a3fe-4162-b1cb-2579ccfd7d12



 

త్వరలో సర్వదర్శనం భక్తులకు మరింత మెరుగైన వసతులు కల్పిస్తామని టీటీడీ కార్యనిర్వహణాధికారి డా|| డి.సాంబశివరావు వెల్లడించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో మంగళవారం సీనియర్‌ అధికారులతో సమీక్ష అనంతరం ఈవో మీడియాతో మాట్లాడారు.

మొదటి దశలో రూ.300/- ప్రత్యేక ప్రవేశదర్శన కాంపెక్స్‌ పూర్తి చేశామని, రెండో దశలో దివ్యదర్శనం భక్తులకు బ్రహ్మోత్సవాలలోపు కాంప్లెక్స్‌ నిర్మిస్తామని, మూడో దశలో సర్వదర్శనం భక్తులకు కూడా ఇదే తరహాలో వసతులు కల్పిస్తామని వివరించారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోందని, శని, ఆదివారాల్లో 80 వేల నుంచి 90 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారని ఈవో తెలిపారు. భక్తులందరికీ ఎలాంటి లోటుపాట్లు లేకుండా మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగా పిఏసి-4ను మంగళవారం నుంచి భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. కల్యాణకట్టలో టోకెన్‌ మంజూరు కౌంటర్లు పెంచి త్వరగా తలనీలాలు సమర్పించేలా చర్యలు చేపడుతున్నామన్నారు.

అంతకుముందు అధికారుల సమీక్షలో ఈవో పలు అంశాలపై చర్చించారు. శ్రీవేంకటేశ్వరప్వామివారి ఆలయంలో ఏర్పాటుచేసిన విధంగా మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద వితరణ కేంద్రంలో ఆగస్టు మొదటివారంలోపు ప్రహరీ ఉద్యానవనాలు ఏర్పాటు చేయాలని ఈవో సూచించారు.

6911c356-0781-4294-be0a-16e486c0cf8e

భక్తులకు మరింత పారదర్శకంగా ఆధిక సంఖ్యలో వసతి గదులు కేటాయంచేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఈవో కోరారు. తిరుమలలోని వసతిగృహాలు, చౌల్ట్రీలలో మూడు రోజులు, అంత కంటే ఎక్కువ రోజులు వున్న వారి వివరాలతో టీటీడీ ఐటి, విజిలెన్స్‌, ప్రజాసంబంధాల విభాగాలు సమన్వయంతో సర్వే నిర్వహించాలన్నారు.

తిరుమలలోని 7050 వసతిగృహాలు, చౌల్ట్రీలలో తాగునీరు, స్నానానికి వేడినీరు అందుబాటులో ఉంచడంతో పాటు కొళాయిలు, వాష్‌బేషిన్‌లు, విద్యుద్దీపాలు తదితరాల మరమ్మతులను పరిశీలించి, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఈవో ఆదేశించారు.

మహిళా శ్రీవారి సేవకులు వుండే పిఎసి3 భవనంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, మరింత భద్రతా చర్యలు తీసుకోవాలని అన్నారు. తిరుమలలో సేవలు అందించే శ్రీవారి సేవకుల తరహాలోనే స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ పూర్తి వివరాలలను సేకరించాలని పి.ఆర్‌.ఒను ఆదేశించారు. శ్రీవారి ఆలయం, విడిది, కల్యాణకట్ట, అన్నప్రసాదంతో పాటు, ఇతర విభాగాల అధికారులు, ఆయా విభాగాలకు సంబంధించిన చేయవలసినవి, చేయకుడని అంశాల జాబితాను రూపొందించి పిఆర్‌వోకు ఇవ్వాలన్నారు. తద్వారా శ్రీవారి సేవకులకు ఈ అంశాలపై శిక్షణ ఇచ్చి భక్తులకు మరింత మెరుగౖౖెన సేవలు అందించవచ్చన్నారు. భక్తులు ఆధార్‌కార్డుతో అంగప్రదక్షిణ టోకన్లు జారీ చేయడానికి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ఐటి విభాగం జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

ఈ సమావేశంలో తిరుమల జెఈవో శ్రీ కె.యస్‌.శ్రీనివాసరాజు, టీటీడీ చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీచంద్రశేఖర్‌రెడ్డి, ఎఫ్‌ఏ, సిఏవో శ్రీ బాలాజి, ఎస్‌ఇ-2 శ్రీరామచంద్రారెడ్డి, ముఖ్య భద్రతాధికారి శ్రీరవీంద్రారెడ్డి, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ కోదండరామారావు, ఆరోగ్యశాఖాధికారి డా|| శర్మిష్ట ఇతర అధికార ప్రముఖులు పాల్గొన్నారు.

orugunda suresh
Orugunda Suresh
Sr Reporter

Orugunda Suresh is an electronic media journalist with eight plus years of experience. He excels in visual communication and has worked as correspondent for premier media organisations such as Maa TV, Mahaa TV,  TV9 Network, ETV Network(TV18 Group), Studio N. He contributes news stories and features  to thirupatinews.com from Tirumala and Tirupati.



Related posts

Leave a Comment