తిరుమలలో ఆక్టోపస్‌ బేస్‌క్యాంప్‌కు భూమిపూజ చేసిన ఏపి డీజీపీ, టీటీడీ ఈవో



కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనార్ధం లక్షలాదిగా విచ్చేసే భక్తులకు మరింత ఉన్నతంగా భద్రత కల్పించేందుకు ఆక్టోపస్‌ భద్రత విభాగం కార్యాలయానికి సోమవారం ఉదయం తిరుమలలో టీటీడీ కార్యనిర్వహణాధికారి డా||డి.సాంబశివరావు, ఏపీ డీజీపీ శ్రీ జే.వి.రాముడుతో కలిసి భూమిపూజ నిర్వహించారు. తిరుమల పాపవినాశనం రోడ్డులో కల్యాణ వేదిక ప్రక్కన ఈ నూతన భవనం నిర్మించనున్నారు.

ఈ సందర్భంగా టీటీడీ ఈవో మాట్లాడుతూ తిరుమల శ్రీవారి ఆలయం, భక్తుల భద్రతకు తితిదే అత్యంత ప్రాధాన్యతను ఇస్తోంది, కావున ఉన్నత ప్రమాణాలు కలిగిన ఆక్టోపస్‌ భద్రతా విభాగాన్ని తిరుమలలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం తిరుమలలో 1.5 ఎకరాల స్థలం, రూ.5 కోట్లను టీటీడీ గ్రాంట్‌గా రాష్ట్ర డీజీపీకి అందించినట్లు తెలిపారు. ఇకపై ఆక్టోపస్‌లోని ఉన్నతాధికారులను టీటీడీ నిఘా మరియు భద్రత విభాగంలో డిప్యూటేషన్‌పై నియమించనున్నట్లు తెలిపారు.

అంతకుముందు రాష్ట్ర డీజీపీ మాట్లాడుతూ తిరుమలకు విచ్చేసే భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోందని, కావున వారికి మరింత సమర్ధవంతంగా భద్రత కల్పించేందుకు ఆక్టోపస్‌ విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తిరుమలలో అనాదిగా వస్తున్న సాంప్రదాయాలను, ఆచారాలను గౌరవిస్త్తూ ఆక్టోపస్‌ విభాగం పనిచేస్తుందన్నారు. అనంతరం టీటీడీ ఈవో, రాష్ట్ర డీజీపీతో కలిసి మొక్కటు నాటి, భవన నిర్మాణ నమూనాను పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో రాయలసీమ రెేంజ్‌ డిఐజీ శ్రీ ప్రభాకర్‌రావు, ఆక్టోపస్‌ అదనపు డి.ఐ.జీ శ్రీ సురేంద్రబాబు, తిరుపతి అర్బన్‌ ఎస్‌.పి.శ్రీమతి విజయలక్ష్మి, ఆలయ డిప్యూటి.ఇ.ఓ శ్రీ కోదండరామారావు, పేష్కార్‌ శ్రీ సెల్వం, విజివో శ్రీ రవీంద్రరెడ్డి, విఎస్‌వో శ్రీమతి విమలకుమారి, ఇతర పోలీస్‌ అధికారులు పాల్గొన్నారు.

This slideshow requires JavaScript.

Orugunda Suresh
Sr Reporter

Orugunda Suresh is an electronic media journalist with eight plus years of experience. He excels in visual communication and has worked as correspondent for premier media organisations such as Maa TV, Mahaa TV,  TV9 Network, ETV Network(TV18 Group), Studio N. He contributes news stories and features  to thirupatinews.com from Tirumala and Tirupati.



Related posts

Leave a Comment