జూలై 21 నుండి తిరుమల శ్రీవారి ఆలయంలో  అంగప్రదక్షణ చేసే భక్తులకు ఆధార్‌ తప్పనిసరి – తిరుమల  జె.ఇ.ఓ శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు



 

తిరుమల శ్రీవారి ఆలయంలో అంగప్రదక్షణకు చేసుకునే భక్తులు జూలై 21వ తారీఖు నుండి ఆదార్‌కార్డు తప్పనిసరిగా ఉండాలని తిరుమల జె.ఇ.ఓ శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు ఆదేశించారు.

సోమవారంనాడు తిరుమల అన్నమయ్య భవనంలో జరిగిన అధికారుల సమీక్షాసమావేశానంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ జూలై 21వ తారీఖు గురువారం నుండి అంగప్రదక్షణ చేసే భక్తులు తప్పనిసరి జూలై 20వ తేది బుధవారం తమ పేర్లు ఆధార్‌కార్డుతో నమోదు చేసుకోవాలని ఆయన కోరారు. శ్రీవారి పోటు, అదనపు పోటును శుభ్రంచేసే కార్యక్రమంలో భాగంగా జూలై 19వ తేది పౌర్ణమిరోజున బూందిపోటును కూడా శుభ్రంచేయాలని ఆదేశించారు. ఇందులో భాగంగా ఆరోగ్యశాఖ, వాటర్‌ వర్క్స్‌ విభాగాల సమన్వయంతో బూంది పోటును శుభ్రం చేయాలని అన్నారు. బూంది పోటు శుభ్రం చేసే కార్యక్రమాన్ని తిరుమల జెఈవో ప్రత్యక్షంగా పర్యవేక్షించనున్నారు.

c538a8e6-fc5b-45dd-86d7-3b9e4c9b40d5కృష్ణాపుష్కరాల్లో శ్రీవారి నమూనా ఆలయం వద్ద లడ్డూ ప్రసాదాలను తీసుకుని వెళ్లేందుకు అవసరమైన లడ్డూ కవర్లను శ్రీవారి సేవకులు ద్వారా విక్రయంచే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. తిరుమల శ్రీవారి దర్శనానికి రూ.300/-, రూ.50/-, నడకదారి భక్తులకు టీటీడీ అందించే టోకన్ల స్కానింగ్‌ కేంద్రాల్లో ఎలాంటి సమస్యలు లేకుండా చూడటానికి అధికారులు తరుచు పర్యవేక్షించాలని, తద్వార భక్తులు త్వరిత గతిన దర్శనం చేసుకునే అవకాశం వుంటుందని జెఈవో తెలిపారు. సామాన్య భక్తులు మరింత సులభంగా శ్రీవారిని దర్శించుకునేలా సమాచారలోపం లేకుండా ఆధికారులు ఎప్పటి కప్పుడు సమన్వయం చేసుకుని క్యూలైన్లు పర్యవేక్షించాలన్నారు. తిరుమలలో ఆరోగ్యశాఖ, విద్యుత్‌శాఖ, ఇంజనీరింగ్‌, ఎఫ్‌.ఎమ్‌.ఎస్‌, వైద్య శాఖ తదితర విభాగాలలో ఉన్న వ్యర్థాలు, ఉపయోగానికి నోచుకోని వాటిని తిరుపతికి తరలించాలని ఆదేశించారు. శ్రీవారి కల్యాణ కట్టలో తలనీలాలు సమర్పించే భక్తుల కోసం టీటీడీ ఏర్పాటు చేసిన ఉచిత లగేజి కౌంటర్లలో తమ వస్తువులు భద్రపరుచుకునేలా విసృత ప్రచారం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. తిరుమలలో రోడ్డుకు ఇరువైపుల అడ్డంగా పెరిగిన చెట్ల కొమ్మలను త్వరిత గతిన తొలగించాలని అన్నారు. తిరుమలలో భక్తుల సౌకర్యాలకు జరుగుతున్న అభివృద్ధి పనులపై శాఖల వారిగా సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో ఎస్‌ఈ2 శ్రీ రామచంద్రరెడ్డి, విజివో శ్రీ రవీంద్రారెడ్డి, ఆరోగ్య శాఖాధికారిణి డా||షర్మిష్ఠ, ఆలయ డిప్యూటి.ఇ.ఓ శ్రీ కోదండరామారావు, ఓఎస్‌డి శ్రీ లక్ష్మినారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Orugunda Suresh
Sr Reporter

Orugunda Suresh is an electronic media journalist with eight plus years of experience. He excels in visual communication and has worked as correspondent for premier media organisations such as Maa TV, Mahaa TV,  TV9 Network, ETV Network(TV18 Group), Studio N. He contributes news stories and features  to thirupatinews.com from Tirumala and Tirupati.



Related posts

Leave a Comment