ఒకే గొడుగు కిందికి టీటీడీలోని ఐటి అప్లికేషన్లు :ఈవో డి.సాంబశివరావు



భక్తుల సౌకర్యార్థం టీటీడీలోని ఆయా విభాగాలు నిర్వహిస్తున్న ఐటి అప్లికేషన్లు అన్నింటినీ ఒకే గొడుగు కిందికి తీసుకొచ్చి టిసిఎస్‌ సంస్థ ఆధ్వర్యంలో మరింత మెరుగ్గా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని టీటీడీ కార్యనిర్వహణాధికారి డా|| డి.సాంబశివరావు సంబంధిత అధికారులకు సూచించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో గల కార్యాలయంలో సోమవారం సీనియర్‌ అధికారులతో ఈవో వారపు సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ధర్మప్రచారంలో భాగంగా సప్తగిరి మాసపత్రికను రాష్ట్రంలోని అన్ని గ్రంథాలయాలకు ఉచితంగా పంపిణీ చేయాలని, తద్వారా ఎక్కువ మంది పాఠకులకు చేరుతుందని తెలిపారు. టీటీడీ విద్యాసంస్థల్లో ఖాళీగా ఉన్న సీట్లకు సంబంధించి అడ్మిషన్లను సకాలంలో పూర్తి చేయాలన్నారు. టీటీడీకి అవసరమైన చింతపండు, బెల్లం సరఫరాకు సంబంధించి సరఫరాదారులతో త్వరలో సమావేశం ఏర్పాటుచేయాలని మార్కెటింగ్‌ అధికారులకు సూచించారు. చింతపండు, బెల్లం ఉత్పత్తి ఎక్కువశాతం చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో ఉందని, ఈ సరుకులను ఎప్పటికప్పుడు నిల్వ ఉంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మార్కెటింగ్‌ అవసరాల కోసం గోడౌన్లు, కోల్డ్‌ స్టోరేజి ప్లాంట్‌ నిర్మాణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఇంజినీరింగ్‌ అధికారులకు సూచించారు.Tirumala Tirupati Temple

తిరుమల శ్రీవారి ఆలయంలో ఉన్న ప్రథమ చికిత్స కేంద్రంలో క్రమం తప్పకుండా డాక్టర్‌, పారామెడికల్‌ సిబ్బంది అందుబాటులో ఉండాలని ఈవో కోరారు. తిరుమలలోని ప్రయివేటు హోటళ్లలో ఎక్కువ లైటింగ్‌తో కూడిన పెద్ద పెద్ద సైన్‌బోర్డులను తొలగించాలని ఆదేశించారు. టీటీడీ స్థానికాలయాలు, విశ్రాంతిగృహాల్లో శుభ్రం చేసేందుకు యంత్రాలను కొనుగోలు చేయాలన్నారు. తిరుపతిలోని అవిలాల చెరువులో జరుగుతున్న పనులను వేగవంతం చేయాలని డిఎఫ్‌ఓకు సూచించారు. మండలస్థాయిలోని కల్యాణమండపాల ఆధునీకరణ పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. టీటీడీ కళాశాలలు, హాస్టళ్లలో కొళాయిల మరమ్మతులు చేపట్టి లీకేజిని అరికట్టాలని ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో టీటీడీ తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌, ప్రాజెక్టుల ప్రత్యేకాధికారి శ్రీ ఎన్‌.ముక్తేశ్వరరావు, న్యాయాధికారి శ్రీ వెంకటరమణ, చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీ చంద్రశేఖర్‌రెడ్డి, ఎఫ్‌ఏ,సిఏవో శ్రీ బాలాజి ఇతర అధికార ప్రముఖులు పాల్గొన్నారు.

Orugunda Suresh
Sr Reporter

Orugunda Suresh is an electronic media journalist with eight plus years of experience. He excels in visual communication and has worked as correspondent for premier media organisations such as Maa TV, Mahaa TV,  TV9 Network, ETV Network(TV18 Group), Studio N. He contributes news stories and features  to thirupatinews.com from Tirumala and Tirupati.



Related posts

Leave a Comment