బర్డ్‌ అదనపు భవనాల నిర్మాణ పనులను వేగవంతం చేయాలి: టీటీడీ ఈవో డి.సాంబశివరావు

బర్డ్‌ అదనపు భవనాల నిర్మాణ పనులను వేగవంతం చేయాలి: టీటీడీ ఈవో డి.సాంబశివరావు

తిరుపతిలోని బర్డ్‌ ఆసుపత్రిలో రోగుల సౌకర్యార్థం నిర్మిస్తున్న అదనపు భవనాల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని టీటీడీ ఈవో డి.సాంబశివరావు ఆదేశించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో గల కార్యాలయంలో సోమవారం బర్డ్‌ ఆసుపత్రి అభివృద్ధి పనులపై ఈవో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ బర్డ్‌లో హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌ సాఫ్ట్‌వేర్‌ రూపకల్పనకు టిసిఎస్‌కు తగిన సహకారం అందించాలని ఇడిపి మేనేజర్‌ శ్రీ భాస్కర్‌ను ఆదేశించారు. ప్రస్తుతం జరుగుతున్న సివిల్‌ పనులతో పాటు లిఫ్టులు, లైట్లు తదితర ఎలక్ట్రికల్‌ పనులను కొనసాగించాలన్నారు. రోగులకు మెరుగైన వైద్యసేవలందించేందుకు అవసరమైన డాక్టర్లు, ఇతర సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని బర్డ్‌ డైరెక్టర్‌  జగదీష్‌ను ఆదేశించారు. పనుల పురోగతి కోసం ప్రతి వారం ఇంజినీరింగ్‌, ఎలక్ట్రికల్‌, ఐటి అధికారులతో సమీక్ష నిర్వహించాలని డైరెక్టర్‌కు సూచించారు. ఈ సమావేశంలో టీటీడీ చీఫ్‌…

Read More

ఒకే గొడుగు కిందికి టీటీడీలోని ఐటి అప్లికేషన్లు :ఈవో డి.సాంబశివరావు

ఒకే గొడుగు కిందికి టీటీడీలోని ఐటి అప్లికేషన్లు :ఈవో డి.సాంబశివరావు

భక్తుల సౌకర్యార్థం టీటీడీలోని ఆయా విభాగాలు నిర్వహిస్తున్న ఐటి అప్లికేషన్లు అన్నింటినీ ఒకే గొడుగు కిందికి తీసుకొచ్చి టిసిఎస్‌ సంస్థ ఆధ్వర్యంలో మరింత మెరుగ్గా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని టీటీడీ కార్యనిర్వహణాధికారి డా|| డి.సాంబశివరావు సంబంధిత అధికారులకు సూచించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో గల కార్యాలయంలో సోమవారం సీనియర్‌ అధికారులతో ఈవో వారపు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ధర్మప్రచారంలో భాగంగా సప్తగిరి మాసపత్రికను రాష్ట్రంలోని అన్ని గ్రంథాలయాలకు ఉచితంగా పంపిణీ చేయాలని, తద్వారా ఎక్కువ మంది పాఠకులకు చేరుతుందని తెలిపారు. టీటీడీ విద్యాసంస్థల్లో ఖాళీగా ఉన్న సీట్లకు సంబంధించి అడ్మిషన్లను సకాలంలో పూర్తి చేయాలన్నారు. టీటీడీకి అవసరమైన చింతపండు, బెల్లం సరఫరాకు సంబంధించి సరఫరాదారులతో త్వరలో సమావేశం ఏర్పాటుచేయాలని మార్కెటింగ్‌ అధికారులకు సూచించారు. చింతపండు, బెల్లం ఉత్పత్తి ఎక్కువశాతం చిత్తూరు,…

Read More

జూలై 19న తిరుమలలో పౌర్ణమి గరుడసేవ

జూలై 19న తిరుమలలో పౌర్ణమి గరుడసేవ

తిరుమలలో ప్రతినెలా పౌర్ణమిరోజు నిర్వహించే పౌర్ణమి గరుడసేవను ఈ నెల 19వ తేదీ టీటీడీ ఘనంగా నిర్వహించనుంది. ఈ సందర్బంగా శ్రీ మలయప్పస్వామివారు తన ఇష్టవాహనమైన గరుడ వాహనంపై మంగళవారం రాత్రి 7 గం||ల నుండి 9 గం||ల నడుమ భక్తులను అనుగ్రహించనున్నారు. గరుడసేవ సందర్భంగా హైదరాబాద్‌కు చెందిన డా||ఎమ్‌.చిత్తరంజన్‌ గానం చేసిన ”అన్నమయ్య నామ సంకీర్తన వైభవం” సిడిలను ఆవిష్కరించనున్నారు.

Read More

తిరుమలలో ఆక్టోపస్‌ బేస్‌క్యాంప్‌కు భూమిపూజ చేసిన ఏపి డీజీపీ, టీటీడీ ఈవో

తిరుమలలో ఆక్టోపస్‌ బేస్‌క్యాంప్‌కు భూమిపూజ చేసిన ఏపి డీజీపీ, టీటీడీ ఈవో

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనార్ధం లక్షలాదిగా విచ్చేసే భక్తులకు మరింత ఉన్నతంగా భద్రత కల్పించేందుకు ఆక్టోపస్‌ భద్రత విభాగం కార్యాలయానికి సోమవారం ఉదయం తిరుమలలో టీటీడీ కార్యనిర్వహణాధికారి డా||డి.సాంబశివరావు, ఏపీ డీజీపీ శ్రీ జే.వి.రాముడుతో కలిసి భూమిపూజ నిర్వహించారు. తిరుమల పాపవినాశనం రోడ్డులో కల్యాణ వేదిక ప్రక్కన ఈ నూతన భవనం నిర్మించనున్నారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో మాట్లాడుతూ తిరుమల శ్రీవారి ఆలయం, భక్తుల భద్రతకు తితిదే అత్యంత ప్రాధాన్యతను ఇస్తోంది, కావున ఉన్నత ప్రమాణాలు కలిగిన ఆక్టోపస్‌ భద్రతా విభాగాన్ని తిరుమలలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం తిరుమలలో 1.5 ఎకరాల స్థలం, రూ.5 కోట్లను టీటీడీ గ్రాంట్‌గా రాష్ట్ర డీజీపీకి అందించినట్లు తెలిపారు. ఇకపై ఆక్టోపస్‌లోని ఉన్నతాధికారులను టీటీడీ నిఘా మరియు భద్రత విభాగంలో డిప్యూటేషన్‌పై నియమించనున్నట్లు తెలిపారు….

Read More

జూలై 21 నుండి తిరుమల శ్రీవారి ఆలయంలో  అంగప్రదక్షణ చేసే భక్తులకు ఆధార్‌ తప్పనిసరి – తిరుమల  జె.ఇ.ఓ శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు

జూలై 21 నుండి తిరుమల శ్రీవారి ఆలయంలో  అంగప్రదక్షణ చేసే భక్తులకు ఆధార్‌ తప్పనిసరి –   తిరుమల  జె.ఇ.ఓ శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు

  తిరుమల శ్రీవారి ఆలయంలో అంగప్రదక్షణకు చేసుకునే భక్తులు జూలై 21వ తారీఖు నుండి ఆదార్‌కార్డు తప్పనిసరిగా ఉండాలని తిరుమల జె.ఇ.ఓ శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు ఆదేశించారు. సోమవారంనాడు తిరుమల అన్నమయ్య భవనంలో జరిగిన అధికారుల సమీక్షాసమావేశానంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ జూలై 21వ తారీఖు గురువారం నుండి అంగప్రదక్షణ చేసే భక్తులు తప్పనిసరి జూలై 20వ తేది బుధవారం తమ పేర్లు ఆధార్‌కార్డుతో నమోదు చేసుకోవాలని ఆయన కోరారు. శ్రీవారి పోటు, అదనపు పోటును శుభ్రంచేసే కార్యక్రమంలో భాగంగా జూలై 19వ తేది పౌర్ణమిరోజున బూందిపోటును కూడా శుభ్రంచేయాలని ఆదేశించారు. ఇందులో భాగంగా ఆరోగ్యశాఖ, వాటర్‌ వర్క్స్‌ విభాగాల సమన్వయంతో బూంది పోటును శుభ్రం చేయాలని అన్నారు. బూంది పోటు శుభ్రం చేసే కార్యక్రమాన్ని తిరుమల జెఈవో ప్రత్యక్షంగా పర్యవేక్షించనున్నారు. కృష్ణాపుష్కరాల్లో శ్రీవారి నమూనా ఆలయం వద్ద…

Read More

 తిరుమలలో వైభవంగా పుష్పపల్లకి సేవ

 తిరుమలలో వైభవంగా పుష్పపల్లకి సేవ

తిరుమల శ్రీవారి ఆలయంలో నేడు జరిగిన ఆణివార ఆస్థానం పురస్కరించుకుని శ్రీవారికి పుష్పపల్లకీ సేవ వేడుకగా జరిగింది. ఆలయంలో సాయంత్రం వైదిక కార్యక్రమాలు ముగించుకున్న శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామివారిని పల్లకిలో వేంచేపుచేశారు. వేదమంత్రాలు, మంగళవాయిద్యాలు, భక్తుల గోవింద నామస్మరణల మధ్య  సాయంత్రం 6 గంటలకు పల్లకీ ఉత్సవ ఊరేగింపు కోలాహలంగా సాగింది… సాయం సంధ్యాసమయంలో ఆలయ నాలుగు మాడ వీధుల్లో పల్లకీపై ఊరేగిన ఉత్సవమూర్తులను భక్తులు కనులారా దర్శించుకుని తన్మయం పొందారు. పుష్ప పల్లకి సాగుతున్న వేళ తిరువీధులు పుష్పపరిమళం వెదజల్లుతు భక్తులను కనువిందు చేశాయి. ఇది ఇలా ఉండగా టీటీడీ ఉద్యానవన శాఖాథికారి శ్రీనివాసులు అధ్వర్యంలో ఉద్యానవన సిబ్బంది, నిపుణులు పుష్ప పల్లకిని అత్యంత వైభవంగా తీర్చిదిద్దారు. దంతపల్లకీపై సుమారు ఎనిమిది వందల యాబై కేజీల సంప్రదాయ, విదేశీ పుష్పాలతో వేలూరు, బెంగళూరుకు…

Read More