పరకామణి విభాగాన్ని ఆధునీకరిస్తాం : టీటీడీ ఈవో డా|| డి.సాంబశివరావు



తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించే కానుకలను మరింత పారదర్శకంగా లెక్కించేందుకు వీలుగా పరకామణి విభాగాన్ని నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఆధునీకరిస్తామని టీటీడీ కార్యనిర్వహణాధికారి డా|| డి.సాంబశివరావు తెలిపారు. తిరుమల శ్రీవారి ఆలయంలోని పరకామణి విభాగాన్ని శుక్రవారం సాయంత్రం తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజుతో కలిసి ఈవో తనిఖీ చేశారు. దాదాపు మూడు గంటల పాటు నోట్లు, చిల్లర నాణేలు లెక్కించే విధానాన్ని పరిశీలించారు. ఇక్కడ చేయాల్సిన మార్పులపై అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ శ్రీవారి ఆలయంలోని పరకామణి విభాగంలో పొరబాట్లకు తావులేకుండా తక్కువ సమయంలో వేగవంతంగా నోట్లను లెక్కించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో చిల్లర నాణేల పరకామణి నూతన భవనాన్ని అన్ని వసతులతో నిర్మిస్తున్నామని తెలిపారు. ఇక్కడ నాణేలను లెక్కించేందుకు అవసరమైన యంత్రాంగాన్ని సిద్ధం చేస్తున్నట్టు వివరించారు.

తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు మాట్లాడుతూ శ్రీవారి ఆలయంలోని పరకామణి విభాగంలో దుమ్ము ధూళికి ఆస్కారం లేకుండా మరింత మెరుగ్గా నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. శ్రీవారి కానుకలను భద్రపరిచే విషయంలో అవసరమైన అన్ని భద్రతాచర్యలు తీసుకుంటున్నామని వివరించారు. తిరుపతిలోని నాణేల పరకామణి భవనాన్ని శాస్త్రోక్తంగా నిర్మిస్తున్నట్టు తెలిపారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీ చంద్రశేఖర్‌రెడ్డి, ఎఫ్‌ఏ,సిఏవో శ్రీ బాలాజి, అదనపు సివిఎస్‌వో శ్రీ శివకుమార్‌రెడ్డి, ఎస్‌ఇ-2 శ్రీ రామచంద్రారెడ్డి, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ కోదండరామారావు, ముఖ్య భద్రతాధికారి శ్రీ రవీంద్రారెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు

Orugunda Suresh
Sr Reporter

Orugunda Suresh is an electronic media journalist with eight plus years of experience. He excels in visual communication and has worked as correspondent for premier media organisations such as Maa TV, Mahaa TV,  TV9 Network, ETV Network(TV18 Group), Studio N. He contributes news stories and features  to thirupatinews.com from Tirumala and Tirupati.



Related posts

Leave a Comment