పరకామణి విభాగాన్ని ఆధునీకరిస్తాం : టీటీడీ ఈవో డా|| డి.సాంబశివరావు

పరకామణి విభాగాన్ని ఆధునీకరిస్తాం : టీటీడీ ఈవో డా|| డి.సాంబశివరావు

తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించే కానుకలను మరింత పారదర్శకంగా లెక్కించేందుకు వీలుగా పరకామణి విభాగాన్ని నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఆధునీకరిస్తామని టీటీడీ కార్యనిర్వహణాధికారి డా|| డి.సాంబశివరావు తెలిపారు. తిరుమల శ్రీవారి ఆలయంలోని పరకామణి విభాగాన్ని శుక్రవారం సాయంత్రం తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజుతో కలిసి ఈవో తనిఖీ చేశారు. దాదాపు మూడు గంటల పాటు నోట్లు, చిల్లర నాణేలు లెక్కించే విధానాన్ని పరిశీలించారు. ఇక్కడ చేయాల్సిన మార్పులపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ శ్రీవారి ఆలయంలోని పరకామణి విభాగంలో పొరబాట్లకు తావులేకుండా తక్కువ సమయంలో వేగవంతంగా నోట్లను లెక్కించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో చిల్లర నాణేల పరకామణి నూతన భవనాన్ని అన్ని వసతులతో నిర్మిస్తున్నామని తెలిపారు. ఇక్కడ నాణేలను లెక్కించేందుకు అవసరమైన యంత్రాంగాన్ని సిద్ధం…

Read More