వాహనం డీకొని మహిళా మృతి

Featured Video Play Icon



తిరుమల: తిరుమలలో తమ సమీప బంధువుల శుభకార్యానికి హాజరై తిరుగు ప్రయాణమయ్యెందుకు మండపం వెలుపల వేచి ఉన్న మహిళపై ఓ బొలెరో వాహనం దూసుకెళ్ళింది. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా చోటు చేసుకున్న ఈ దుర్ఘటనలో మహిళ అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. అప్పటి వరకు ఆనందంలో ఉన్న బంధువులు ఈ ఘటనతో ఒక్కసారిగా శోక సముద్రంలో మునిగిపోయారు.

చెన్నైకి చెందిన గీత (47) అనే మహిళ తమ సమీప బంధువుల నామకరణానికి హాజరయ్యేందుకు శనివారం తిరుమల చేరుకుంది. ఈ రోజు ఉదయం శ్రీవారిని దర్శించుకుని మధ్యాహ్నానికి గోగార్భం డ్యాం సమీపంలోని మౌన స్వామీ మఠంలో బంధువుల శుభకార్యానికి హాజరై అందరితో ఇక ఇంటికి వెల్లి వస్తానని చెప్పి మఠం వెలుపలకు వచ్చిన కొద్దీ నిమిషాలకే మృత్యువు ఆమెను కబలించింది. మఠం వెలుపల వాహనం ఎక్కేందుకు వేచి ఉన్న సమయంలో ఓ బొలెరో వాహనం వెనుకకు వచ్చి ఆమెపై దూసుకెళ్ళింది. మఠం ముందున్న పల్లపు ప్రాంతంలో అజాగ్రత్తగా వాహనాన్ని పార్క్ చేసి వెళ్లిన డ్రైవర్ నిర్లక్ష్యమే ఆమె ప్రాణాలు తీసింది. వాహనానికి హ్యాండ్ బ్రేక్ లేని కారణంగా డ్రైవర్ చిన్నపాటి రాయిని చక్రం కింద ఉంచి వెళ్లాడు. కొద్దీసేపటికే రాయి పక్కకి తొలగి వెనుకకే వచ్చిన బొలెరో ముందుగా ఓ టెంపోను ఢీకొని ఆపై మఠం ముందు వేచి ఉన్న మహిళ పైకి దూసుకెళ్ళింది. దింతో ఆమె అక్కడే ప్రాణాలు విడిచింది. బంధువులు హుటాహుటిన ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్లిన అప్పటికే ఆమె ప్రాణాలు విడిచింది. ఇది కేవలం డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే జరిగిందని ప్రత్యక్ష సాక్షులు, బంధువులు ఆరోపిస్తూన్నారు.

orugunda suresh
Orugunda Suresh
Sr Reporter

Orugunda Suresh is an electronic media journalist with eight plus years of experience. He excels in visual communication and has worked as correspondent for premier media organisations such as Maa TV, Mahaa TV,  TV9 Network, ETV Network(TV18 Group), Studio N. He contributes news stories and features  to thirupatinews.com from Tirumala and Tirupati.



Related posts

Leave a Comment