కృష్ణా పుష్కరాల ఏర్పాట్లపై జెఈవో సమీక్ష

కృష్ణా పుష్కరాల ఏర్పాట్లపై జెఈవో సమీక్ష

పవిత్రమైన కృష్ణా నది పుష్కరాలు ఆగస్టు 12వ తేదీ నుంచి ప్రారంభంకానుండడంతో టీటీడీ తరఫున చేపడుతున్న ఏర్పాట్లపై తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు శుక్రవారం సాయంత్రం తిరుమలలోని అన్నమయ్య భవనంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ నవ్యాంధ్ర రాజధాని నగరంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న పుష్కరాల్లో విజయవాడలోని పిడబ్ల్యుడి మైదానంలో ఏర్పాటు చేయనున్న శ్రీవారి నమూనా ఆలయం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని తెలిపారు. వేలాది మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటారని, గతంలో జరిగిన గోదావరి పుష్కరాల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని అన్ని విభాగాల అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. టీటీడీ చేపడుతున్న ఏర్పాట్లపై రాష్ట్ర ముఖ్యమంత్రి గౌ|| శ్రీ నారా చంద్రబాబునాయుడు ప్రత్యేక దృష్టి పెడుతున్నట్టు వివరించారు. శ్రీవారి నమూనా ఆలయం పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని, ఈ నెలాఖరు లోపు పూర్తి…

Read More

శ్రీవారి కొలువులో లక్ష్మి(గజరాజు)

శ్రీవారి కొలువులో లక్ష్మి(గజరాజు)

తిరుమల: శ్రీవారి కొలువులో లక్ష్మి అనే గజరాజు ఇకపై సేవలు అందించనుంది. దశాబ్ద కాలంగా తిరుమలలో సేవలు అందిస్తున్న పద్మావతి అనే గజరాజు స్వల్ప అనారోగ్యానికి గురి కావడంతో ఆ స్థానంలో తిరుపతిలోని టి‌టి‌డి అనుబంధ ఆలయాల్లో సేవలు అందిస్తున్న లక్ష్మి అనే గజరాజును శుక్రవారం తిరుమలకు తీసుకువచ్చారు. ఇకపై పద్మావతి(గజరాజు) స్థానంలో లక్ష్మి(గజరాజు) సేవలు అందించనుంది. అనారోగ్యానికి గురైన పద్మావతిని(గజరాజు) శుక్రవారం టి‌టి‌డి సిబ్బంది కాలినడకన తిరుపతికి తీసుకువెళ్లారు. అక్కడ ఎస్వీ గోశాలలో గజరాజుకు చికిస్థ అందించనున్నారు.

Read More

టి‌టి‌డి అన్నప్రసాద సేవలను అభినందించిన గవర్నర్

టి‌టి‌డి అన్నప్రసాద సేవలను అభినందించిన గవర్నర్

తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామివారి పేరిట లక్షలాది మంది భక్తులకు టి‌టి‌డి అందిస్తున్న అన్నదాన సేవలను ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ అభినందించారు. శుక్రవారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్న అనంతరం గవర్నర్ తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నదాన సముదాయాన్ని సందర్శించారు. ఈ సంధర్భంగా గవర్నర్ నరసింహన్ తిరుమల జెఈఓ శ్రీనివాసరాజుతో కలసి సముదాయంలోని అన్నప్రసాదం తయారు చేసే వంటశాలలను, హాలులో భక్తులకు అన్నదానం వడ్డించే తీరును స్వయంగా పరిశీలించారు. తిరుమల జెఈఓ శ్రీనివాసరాజు గవర్నర్’కు సముదాయంలోని వంటశాలలు, అన్నప్రసాదం తయారీ విధానం, సామగ్రి నిల్వ గదులు,కొబ్బరికాయల నిల్వ ఉంచే గది, కోల్డ్ స్టోరేజ్ గదిని చూపించి వాటి గురించి దగ్గరుండి వివరించారు. అన్నదాన సముదాయంలో అత్యంత సుందరంగా తీర్చిదిద్దిన పంచ క్షేత్రాలయిన శ్రీశైలం, త్రిపురాంతకం, మహానంది, అహోబిలం మరియు వెంకటాచలం క్షేత్రాల వైభవం…

Read More

తలనీలాల విక్రయం ద్వారా టీటీడీ ఆదాయం రూ.12.45 కోట్లు

తలనీలాల విక్రయం ద్వారా టీటీడీ ఆదాయం రూ.12.45 కోట్లు

కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసే కోటానుకోటి భక్తులు భక్తిశ్రద్ధలతో సమర్పించిన తలనీలాల ఈ-వేలంలో టీటీడీ రూ.12.45 కోట్ల ఆదాయాన్ని గడించింది. శుక్రవారం నాడు తలనీలాల ఈ వేలం జరిగింది. మొదటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, తెల్లవెంట్రుకలు తలనీలాల రకాల ఈ-వేలం నిర్వహించారు. ఈ నెల నిర్వహించిన ఈ-వేలంలో మొత్తం 14,500 కిలోల తలనీలాలు అమ్ముడుపోయాయి. తలనీలాలలో మొదటి రకం(31 ఇంచుల పైన), రెండో రకం(16 నుండి 30 ఇంచులు), మూడో రకం(10 నుండి 15 ఇంచులు), నాలుగో రకం(5 నుండి 9 ఇంచులు), ఐదో రకం(5 ఇంచుల కన్నా తక్కువ), తెల్లవెంట్రుకల రకాలను టీటీడీ ఈ-వేలంలో పెట్టింది. కిలో రూ.25,563/-గా ఉన్న మొదటి రకం తలనీలాలను మొత్తం 3700 కిలోలను వేలానికి ఉంచగా 300 కిలోలు అమ్ముడుపోయాయి. తద్వారా…

Read More