జులై 23 నుంచి 25వ తేదీ వరకు తిరుమలలో గురువందన మహోత్సవం



గురుపౌర్ణిమ పర్వదినాన్ని పురస్కరించుకుని టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో తిరుమలలోని ఆస్థానమండపంలో జులై 23 నుంచి 25వ తేదీ వరకు గురువందన మహోత్సవం ఘనంగా జరుగనుంది.

ఇందులోభాగంగా ప్రతిరోజూ ఆస్థానమండపంలో ఉదయం 5 నుంచి 7.30 గంటల వరకు ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర ప్రాంతాలకు చెందిన భజనమండళ్లతో సుప్రభాతం, ధ్యానం, సామూహిక భజన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పండితులతో ఆధ్యాత్మిక – ధార్మిక సందేశాలు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నామసంకీర్తన-సంగీత విభావరి కార్యక్రమాలు జరుగనున్నాయి.

జులై 24వ తేదీన ఉదయం 5 గంటలకు సుప్రభాతం, నాలుగు మాడ వీధుల్లో నగర సంకీర్తన, ఉదయం 9గం||ల నుంచి 11 గంటల వరకు ప్రముఖ మఠాధిపతులతో గురుబోధ, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు గురుమహిమ కీర్తనలు-ప్రవచన కార్యక్రమాలు చేపడతారు. టీటీడీ దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ పి.ఆర్‌.ఆనందతీర్థాచార్య ఈ కార్యక్రమాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

Orugunda Suresh
Sr Reporter

Orugunda Suresh is an electronic media journalist with eight plus years of experience. He excels in visual communication and has worked as correspondent for premier media organisations such as Maa TV, Mahaa TV,  TV9 Network, ETV Network(TV18 Group), Studio N. He contributes news stories and features  to thirupatinews.com from Tirumala and Tirupati.



Related posts

Leave a Comment