రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం



తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామికి ఆదివారం రోజున రికార్డు స్థాయిలో రూ. 4.22 కోట్ల హుండీ ద్వారా సమకూరాయి. ఇటీవల కాలంలో ఆలయ లెక్కల ప్రకారం ఇది రికార్డుగా నిలిచింది. శనివారం ఆలయ హుండీలో భక్తులు సమర్పించిన కానుకలను ఆదివారం లెక్కించారు. అజ్ఞాత భక్తులు కొందరు భారీ స్థాయిలో హుండీలో కానుకలు సమర్పించడం వలన శ్రీవారి ఆదాయం నాలుగు కోట్లు దాటినట్లు తెలుస్తోంది. గతంలో ఇదే విధంగా

ఈ ఏడాది మార్చిలో 14వ తేదీ 4.00 కోట్లు, 21వ తేదీ 3.05 కోట్లు, 22వ తేదీ 3.07 కోట్లు, 25వ తేదీ 3.27 కోట్లు, 26వ తేదీ 3.68 కోట్లు, 28వ తేది 3.51 కోట్లు,
ఏప్రిల్ 4వ తేదీ 3.10 కోట్లు 5వ తేదీ 4.09 కోట్లు, జున్ 13వ తేదీ 3.87 కోట్లు, 15వ తేదీ 3.64 కోట్లు ,18వ తేదీ 3.21 కోట్లు, 20 తేదీ 3.58 కోట్లు, మే లో 22వ తేదీ 3.22కోట్లు హుండీ ఆదాయం లభించగా… ఆదివారం ఆదాయం దాన్ని దాటిపోవడం విశేషం.
కాగా, 2012 జనవరి 3న వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని రూ. 4.25 కోట్లు లభించాయి, అలాగే 2012 మార్చిలో ఒక రోజు హుండీ ద్వారా లభించిన రూ.5.73 కోట్లు అత్యధిక రికార్డు, అంతక ముందు 2014 జూన్ 22వ తేదీ 4.45 కోట్లు రికార్డు స్థాయిలో ఇప్పటి వరకు ఉంది.

కొనసాగుతున్న రద్దీ: తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ కొనసాగింది. గదుల కోసం, తలనీలాలు సమర్పించుకునేందుకు, స్వామి దర్శనానికి భక్తులు క్యూలలో బారులుతీరారు. ఉదయం 6 గంటల వరకు 86,662 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఇదే సమయానికి సర్వదర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకునేందుకు 9 గంటల సమయం పడుతుండగా కాలినడకన వచ్చే భక్తులకు కల్పించే దివ్యదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది.

Orugunda Suresh
Sr Reporter

Orugunda Suresh is an electronic media journalist with eight plus years of experience. He excels in visual communication and has worked as correspondent for premier media organisations such as Maa TV, Mahaa TV,  TV9 Network, ETV Network(TV18 Group), Studio N. He contributes news stories and features  to thirupatinews.com from Tirumala and Tirupati.



Related posts

Leave a Comment