తిరుమలలో నాగు పాము హల్చల్తిరుమలలో కళ్యాణ వేదిక వద్ద వున్న పౌరోహిత సంఘంలో నాగు పాము హల్చల్ చేసింది. ఇవాళ సాయంత్రం పౌరోహిత సంఘంలోని పురోహితులు బస చేసే రూంలో నాగు పామును చూసిన పురోహితులు పరుగులు తీశారు. దింతో కొంత సమయం అక్కడ గందరగోళ పరిస్థితి ఏర్పడింది. కొంత సమయం తరువాత తేరుకున్న పురోహితులు సిబ్బంది అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించగా, టీటీడీ ఉద్యోగి పాములు భాస్కర్ నాయుడుని సంఘటనా స్థలానికి పిలిపించారు. అతడు చాకచక్యంగా పామును పట్టుకుని తిరిగి అడవిలో వదిలిపెట్టాడు. దీంతో అక్కడ వున్న పురోహితులు, భక్తులు అందరూ ఊపిరి పీల్చుకోగలిగారు. సంఘటనా స్థల౦లో వున్న పురోహితులు తమ సెల్ పోన్లలో నాగు పాము బందించారు

snake1

snake2Related posts

Leave a Comment