శ్రీకోదండరామాలయంలో ఘనంగా అష్టోత్తర శతకలశాభిషేకంతిరుపతిలోని శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో సోమవారం అష్టోత్తర శతకలశా భిషేకం వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా ఆలయంలోని మహామండపంలో ఉదయం 10.00 గంటలకు అమ్మవారు, స్వామివార్ల ఉత్సవమూర్తులకు 108 కలశాలతో అభిషేకం చేశారు.

ఈ సందర్భంగా సాయంత్రం 5.30 గంటలకు శ్రీ సీత లక్ష్మణ సమేత శ్రీకోదండరామ స్వామివారి ఉత్సవమూర్తులను ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించనున్నారు. అక్కడినుంచి శ్రీరామచంద్ర పుష్కరిణికి తీసుకెళ్లి ఆస్థానం చేపడతారు. ఆ తరువాత పుష్కరిణి హారతి నిర్వహిస్తారు.

ఈ కార్యక్రమంలో తితిదే స్థానికాలయాల డెప్యూటీ ఈవో శ్రీమతి బి.మునిలక్ష్మి, సూపరింటెండెంట్‌ శ్రీ ఉమామహేశ్వర్‌రెడ్డి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ శేషారెడ్డి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.Related posts

Leave a Comment