శ్రీవారి ఆలయ బూంది పోటులో అగ్ని ప్రమాదంతిరుమల శ్రీవారి అదనపు లడ్డూ పోటులో ఈ రోజు వేకువజామున జరిగిన అగ్నిప్రమాదంలో అస్తి నష్టం వాటిల్లింది. ఎటువంటి ప్రాణనష్టం వాటిల్లకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. భవిష్యత్తులో ఇటువంటి అగ్నిప్రమాదాలు చోటు చేసుకోకుండా పూర్తిస్ధాయిలో చర్యలు తీసుకుంటామని టిటిడి ఈఓ సాంబశివరావు చెప్పారు.

నిత్యం వేలాది మంది భక్తులు శ్రీవారి దర్శనంకోసం తిరుమలకు వస్తుంటారు. భక్తులకు అవసరమైన లడ్డూప్రసాదాలను అందుబాటులో ఉంచేందుకు టిటిడి యాజమాన్యం అలయం వెలుపల అదనపు లడ్డూ పోటును నిర్మించింది. వెలుపల తయారైయ్యే బూందీని అలయంలోపల లడ్డూలుగా మార్చుతారు. అయితే ఈ రోజు వేకువజామున 3గంటల 30నిమిషాలకు అదనపు లడ్డూపోటులో కార్మికులు పనులు ప్రారంభించారు. అయితే ఐదుగంటల సమయంలో బూందీని వేసేందుకు నెయ్యి వేడిని పరిశీలించేందుకు సిబ్బంది ప్రయత్నించారు. దీంతో మంటలు ఒక్కసారిగా నెయ్యిని తాకాయి. మంటల పెద్దఎత్తున ఎగసిపడ్డాయి. అయితే గత కోద్దిరోజులుగా శుభ్రం చేయకపోవడంతో పోగవెళ్లే గోట్టంలో పేరుకుపోయిన నెయ్యి వ్యర్ధాలకు మంటలు సోకడంతో ప్రమాదం మరింత పెరిగింది. దీంతో బూందీ పోటుతో పాటు మేడపైన ఉన్న పైబర్ షీట్లు పూర్తిగా కాలిదగ్ధమైయ్యాయి. సమాచారం అందుకుని సంఘటనా స్ధలానికి చేరకున్న రెండు అగ్నిమాపక వాహనాలు దాదాపు గంటపాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చాయి. విషయం తెలుసుకున్న టిటిడి ఈఓ సాంబశివరావు, జేఈఓ శ్రీనివాసరాజు, ఇతర అధికారులు హూటాహూటిన సంఘటనా స్ధలానికి చేరుకున్నారు. అగ్నిప్రమాదం కారణంగా అస్ధినష్టం వాటిల్లినా.., ఎటువంటి ప్రాణాపాయం జరగలేదన్నారు. భవిష్యత్తులో అధునికత జోడించిన అగ్నిప్రమాదాలు పునరావృత్తం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాగా స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులకు లడ్డూప్రసాదాల కోరత రాకుండా వేసవి నేపథ్యంలో ముందస్తుంగా ఐదు లక్షలకు పైగా లడ్డులు నిల్వ వున్నయి అన్ని త్వరితగతిన బూందీ పోటులో పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

దాదాపు గంటపాటు మంటలను కష్టపడి మంటలను పూర్తిగా అర్పివేసిన అగ్నిమాపక సిబ్బంది అధికారులు అభినందించారు. బూందీ పోటులో తరచు అగ్నిప్రమాదాలు చోటు చేసుకోకుండా తీసుకోవాల్సిన చర్యలపై దృష్టిసారించినట్లు అగ్నిమాపక శాఖ అధికారి తెలిపారు. టిటిడి సహకారంతో సాధ్యమైనంత త్వరలో మార్పులు చేస్తామని వెల్లడించారు.Related posts

Leave a Comment