తిరుమలలో వైకుంఠం క్యూకాంప్లెక్స్‌ను తనిఖీ చేసిన జెఈవోphoto260687825080530458తిరుమలలో వైకుంఠం క్యూకాంప్లెక్స్‌ను జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు శుక్రవారం తనిఖీ చేశారు. క్యూలైన్లు కదులుతున్న తీరును గమనించి అధికారులకు పలు సూచనలు చేశారు. కంపార్ట్‌మెంట్లలోని భక్తులను క్రమపద్ధతిలో పంపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అన్నప్రసాదాలు సమయానికి అందుతున్నాయా లేదా అనే విషయాన్ని భక్తులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం శ్రీవారి సేవకులు సేవలందిస్తున్న లడ్డూ కౌంటర్లను పరిశీలించారు. చేతులు తొడుగులు ధరించి లడ్డూలు పంపిణీ చేయడాన్ని తనిఖీ చేశారు. శ్రీవారి సేవకులు లడ్డూ ప్రసాత వితరణ సేవను సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో టిటిడి సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌ శ్రీ రామచంద్రారెడ్డి, అన్నప్రసాదం ప్రత్యేకశ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి చెంచులక్ష్మి, ముఖ్య భద్రతాధికారి శ్రీ రవీంద్రారెడ్డి, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ షర్మిష్ట ఇతర అధికారులు పాల్గొన్నారు.Related posts

Leave a Comment