తాళ్లపాకలో వైభవంగా శ్రీవారి కల్యాణం

తాళ్లపాకలో వైభవంగా శ్రీవారి కల్యాణం

పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 608వ జయంతిని పురస్కరించుకుని ఆయన జన్మస్థలమైన వైఎస్‌ఆర్‌ కడప జిల్లా తాళ్లపాకలోని ధ్యానమందిరం వద్ద తితిదే శనివారం ఉదయం శ్రీవారి కల్యాణాన్ని కన్నులపండువగా నిర్వహించింది. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిపై 32 వేలకు పైగా సంకీర్తనలు రచించిన మొదటి వాగ్గేయకారుడు అన్నమయ్య జయంతి ఉత్సవాలు తాళ్లపాక, తిరుపతిలో శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. తాళ్లపాకలో ఉదయం 10.00 గంటలకు వేద పండితులు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారి ఉత్సవర్లను కల్యాణవేదిక వద్దకు తీసుకొచ్చారు. ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 1.00 గంట వరకు అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా స్వామివారి కల్యాణాన్ని నిర్వహించారు. పుణ్యహవచనం, పవిత్రహోమం, కంకణధారణ, మాంగళ్యధారణ, మంగళాశాసనం ఘట్టాలతో సంప్రదాయబద్ధంగా శ్రీవారి కల్యాణం జరిగింది. చివరిగా నక్షత్రహారతి, మంగళహారతి కార్యక్రమంతో కల్యాణం దిగ్విజయంగా ముగిసింది. అనంతరం అన్నమయ్య వంశీకులను…

Read More

తిరుమలలో వైకుంఠం క్యూకాంప్లెక్స్‌ను తనిఖీ చేసిన జెఈవో

తిరుమలలో వైకుంఠం క్యూకాంప్లెక్స్‌ను తనిఖీ చేసిన జెఈవో

తిరుమలలో వైకుంఠం క్యూకాంప్లెక్స్‌ను జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు శుక్రవారం తనిఖీ చేశారు. క్యూలైన్లు కదులుతున్న తీరును గమనించి అధికారులకు పలు సూచనలు చేశారు. కంపార్ట్‌మెంట్లలోని భక్తులను క్రమపద్ధతిలో పంపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అన్నప్రసాదాలు సమయానికి అందుతున్నాయా లేదా అనే విషయాన్ని భక్తులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం శ్రీవారి సేవకులు సేవలందిస్తున్న లడ్డూ కౌంటర్లను పరిశీలించారు. చేతులు తొడుగులు ధరించి లడ్డూలు పంపిణీ చేయడాన్ని తనిఖీ చేశారు. శ్రీవారి సేవకులు లడ్డూ ప్రసాత వితరణ సేవను సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో టిటిడి సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌ శ్రీ రామచంద్రారెడ్డి, అన్నప్రసాదం ప్రత్యేకశ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి చెంచులక్ష్మి, ముఖ్య భద్రతాధికారి శ్రీ రవీంద్రారెడ్డి, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ షర్మిష్ట ఇతర అధికారులు పాల్గొన్నారు.

Read More