జెండా కలకలంతిరుమలలో ఓ మతానికి చెందిన జెండా తీవ్ర కలకలం రేపింది. మీడియా అందించిన సమాచారం మేరకు జెండాను పరిశీలించిన టీటీడీ విజిలెన్స్ అధికారులు ఇది ఇస్లాం మతానికి చెందినదిగా గుర్తించి జండాను తొలిగించారు. జెండాను నాటిన వారికోసం విజిలెన్స్ ప్రస్తుతం గాలిస్తోంది. తిరుమలలోని పాపవినాసనం మార్గం మధ్యలో ఉన్న జపాలి తీర్థం వెళ్ళే దారిలో ఆర్చ్’పై ఈ జెండాను ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు నాటి వెళ్లారు. ఆదివారం సాయంత్రం ఇది మీడియా కంట పడింది. వెంటనే మీడియా విజిలెన్స్ అధికారులకు సమాచారం అందించడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకొని జెండాను తొలిగించారు. అయితే జెండా ఇస్లాం మతానికి చెందినదా లేక మరేదైనా మతంకు చెందినడా అన్నది తేలాల్సి ఉంది.

Photo Credit:O.Suresh/ TTN
Photo Credit:O.Suresh/ TTN

అయితే విజిలెన్స్ అధికారులు మాత్రం ఇది ఇస్లాంకు చెందిన జెండాగా భావిస్తున్నారు. టీటీడీ విజిలెన్స్ సెక్టార్-3 ఎవి & ఎస్ఓ వెంటాద్రి మీడియాతో మాట్లాడుతూ ఎవరో గుర్తు తెలియని వారు జపాలి తీర్థ వెళ్ళే మార్గంలో ఆర్చ్’పై ముస్లిం జెండాను నాటి వెళ్లారని అంటున్నారు. దీనిపై పై స్థాయి అధికారులకు సమాచారం ఇచ్చామని, వారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని అంటున్నారు… ఇది ఇలా ఉండగా జపాలి ఆర్చిపై దర్శనమిచ్చిన జెండా ఉత్తర భారత దేశంలొని కొన్ని హిందూ తండాలకు చెందినదిగా పలువురు భావిస్తున్నారు.

Photo:O.Suresh/TTN
Photo:O.Suresh/TTN

ఇదే కనుక నిజమైతే ఇస్లాం మతం జెండా అంటూ కలకలం రేపిన ప్రస్తుత ఉదంతం సత్యదూరం అవుతుంది. ఏది ఏమైనా ఇలా టి‌టి‌డి అనుమతి లేకుండా జెండాలను నాటడం తిరుమలలో మరోసారి తీవ్ర కలకలం రేపాయి, ఇలాంటివి ఇకపై కొనసాగితే మత చాంధసులు దీన్ని అదునుగా తీసుకుని తిరుమల పవిత్రతను మంటగలిపే ప్రమాదం ఉంది.Related posts

Leave a Comment