వేడుకగా శ్రీ పద్మావతీ పరిణయోత్సవం

వేడుకగా శ్రీ పద్మావతీ పరిణయోత్సవం

శ్రీపద్మావతీ శ్రీనివాసుల పరిణయోత్సవ మహోత్సవంలో రెండవ రోజైన సోమవారంనాడు వైశాఖశుద్ధ దశమి. ఇదే అసలు అలనాటి ముహూర్తదినమని పురాణాలు ఘోషిస్తున్నాయి. కనుక ఈ మూడు రోజుల పద్మావతీ పరిణయోత్సవంలో రెండవ రోజు ప్రాముఖ్యతను సంతరించుకుంది. సోమవారం సాయంత్రం శ్రీ స్వామివారు అశ్వవాహనాన్ని అధిరోహించి సకల సార్వభౌమాధికార లాంఛనాలతో బయలుదేరి, వెంట స్వర్ణ పల్లకిలో శ్రీదేవి మరియు భూదేవి అనుసరించగా నారాయణగిరి ఉద్యానవనానికి చేరుకున్నారు. మొదటిరోజు మాదిరే శ్రీస్వామివారికి అమ్మవార్లకు ఎదుర్కోలు, పూలబంతులాట, నూతన వస్త్రధారణ తదితర కార్యక్రమాలు పూర్తయిన తరువాత కొలువు జరుగుతుంది. ఈ కొలువులో హరికథ, నృత్యం, పురాణం, ఇత్యాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆ తరువాత శ్రీవారు దేవేరులతో పల్లకినెక్కి తిరువీధులగుండా ఊరేగుతూ ఆలయ ప్రవేశం చేయడంతో రెండవరోజు పరిణయోత్సవ వేడుక ముగుస్తుంది. ఈ ఉత్సవం కారణంగా శ్రీవారి ఆలయంలో ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకార…

Read More

జెండా కలకలం

జెండా కలకలం

తిరుమలలో ఓ మతానికి చెందిన జెండా తీవ్ర కలకలం రేపింది. మీడియా అందించిన సమాచారం మేరకు జెండాను పరిశీలించిన టీటీడీ విజిలెన్స్ అధికారులు ఇది ఇస్లాం మతానికి చెందినదిగా గుర్తించి జండాను తొలిగించారు. జెండాను నాటిన వారికోసం విజిలెన్స్ ప్రస్తుతం గాలిస్తోంది. తిరుమలలోని పాపవినాసనం మార్గం మధ్యలో ఉన్న జపాలి తీర్థం వెళ్ళే దారిలో ఆర్చ్’పై ఈ జెండాను ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు నాటి వెళ్లారు. ఆదివారం సాయంత్రం ఇది మీడియా కంట పడింది. వెంటనే మీడియా విజిలెన్స్ అధికారులకు సమాచారం అందించడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకొని జెండాను తొలిగించారు. అయితే జెండా ఇస్లాం మతానికి చెందినదా లేక మరేదైనా మతంకు చెందినడా అన్నది తేలాల్సి ఉంది. అయితే విజిలెన్స్ అధికారులు మాత్రం ఇది ఇస్లాంకు చెందిన జెండాగా భావిస్తున్నారు. టీటీడీ విజిలెన్స్ సెక్టార్-3…

Read More