శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనంతిరుపతి: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో గురువారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘనంగా జరిగింది. ఆలయంలో మే 14 నుండి 22వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్న విషయం విదితమే. బ్రహ్మోత్సవాల ముందు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.

ఈ సందర్భంగా గురువారం తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం నిర్వహించారు. ఉదయం 6.00 నుండి 8.30 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరిగింది. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. ఈ కారణంగా ఉదయం 6.00 నుండి 9.00 గంటల వరకు ఆలయ తలుపులు మూసి ఉంచారు. అనంతరం భక్తులను ఉదయం 9.00 గంటల నుండి సర్వదర్శనానికి అనుమతించారు.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

తేదీ ఉదయం సాయంత్రం

14-05-16(శనివారం)       ధ్వజారోహణం          పెద్దశేష వాహనం

15-05-16(ఆదివారం)       చిన్నశేష వాహనం       హంస వాహనం

16-05-16(సోమవారం)        సింహ వాహనం     ముత్యపుపందిరి వాహనం 17-05-16(మంగళవారం) కల్పవృక్ష వాహనం సర్వభూపాల వాహనం

18-05-16(బుధవారం) మోహినీ అవతారం      గరుడ వాహనం

19-05-16(గురువారం) హనుమంత వాహనం గజ వాహనం

20-05-16(శుక్రవారం) సూర్యప్రభ వాహనం    చంద్రప్రభ వాహనం

21-05-16(శనివారం) రథోత్సవం అశ్వవాహనం

22-05-16(ఆదివారం) చక్రస్నానం       ధ్వజావరోహణం

ఈ కార్యక్రమంలో టీటీడీ స్థానిక ఆలయాల ఉప కార్యనిర్వహణాధికారి శ్రీమతి వరలక్ష్మీ, సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీ ప్రసాద్‌మూర్తిరాజు, సూపరింటెండెంట్లు శ్రీ వేణుగోపాల్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ నాగరాజు, ఇతర అధికారులు, ఆర్చకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.Related posts

Leave a Comment