నవ్యాంధ్రప్రదేశ్ రాజదానిలో శ్రీవారి ఆలయం నిర్మిస్తాంటి‌టి‌డి ఈ‌ఓ సాంబశివరావు     

తిరుమల: నవ్యాంధ్రప్రదేశ్ రాజదాని అమరావతిలో నూతన శ్రీవారి ఆలయాన్ని నిర్మించనున్నామని టి‌టి‌డి ఈవో సాంబశివరావు వెల్లడించారు. బుధవారం తిరుమలలోని అన్నదాన సముదాయంలో భక్తులకు అల్పాహారా వితరణను టి‌టి‌డి ఈఓ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సంధర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కోరిక మేరకు రాజదాని నగరం అమరావతిలో శ్రీవారి ఆలయాన్ని నిర్మించేందుకు టి‌టి‌డి సంసిద్దంగా ఉందని తెలిపారు. ఆలయ నిర్మాణం కోసం ప్రభుత్వం మూడు ప్రాంతాలను పరిశీలించాలని సిఫార్సు చేసిందని, వాటిలో నిర్మాణానికి అనువుగా ఉన్న స్థలాన్ని ఎంపిక చేసుకుని టి‌టి‌డి ఆలయాన్ని నిర్మిస్తుందని తెలిపారు. 10 ఎకరాల సువిశాలమైన ప్రాంగణంలో ఆలయం నిర్మించనున్నామని చెప్పారు. గర్భాలయం, ఆలయ ప్రాకారం, మాడ వీధులు, పుష్కరిణి వంటివి మిర్మిస్తామని తెలిపారు. అలానే కృష్ణ పుష్కరాలకు ప్రభుత్వం కోరిన విధంగానే ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. గోధావారి పుష్కరాలలో టి‌టి‌డి అందించిన సేవలు కృష్ణ పుష్కరాలలో కూడా కొనసాగిస్తామన్నారు. అమరావతిలో ఆలయ నిర్మాణం కోసం, కృష్ణ పుష్కారాల ఏర్పాట్ల కోసం ఒక ప్రత్యేక ఇంజనీరింగ్ విభాగాన్ని ఏర్పాటు చేసి, పనులను వేగవంతంగా పూర్తిచేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు..Related posts

Leave a Comment