టి‌టి‌డి పాలక మండలి నిర్ణయాలుపోటు కార్మికులకు మరో ఏడాది పాటు నియామక కాలం పొడిగింపు

·         10 శఠగోపాల తయారీకి ఆమోదం, ఒక్కో శఠగోపంకు 72.75 లక్షలు కర్చు

·         ఒంటిమిట్టలో యాత్రి సదన్ నిర్మాణానికి 4.60 కోట్లు

·         అర్చకుల సంరక్షణకు మరో 25 కోట్లు

·         బంజారా హీల్స్లో శ్రీవారి ఆలయ నిర్మాణానికి 18 కోట్లు, మే మొదటి వారంలో శంకుస్థాపన

·         శసర్వభూపాల, ముత్యపుపందిరి నూతన వాహనాల తయారీకి 3.86 కోట్లు

 

తిరుమల, ఏప్రిల్ 26: తిరుమల శ్రీవారి ఆలయంలోని వంటశాలలో(పోటు) కొంట్రాక్ట్ విధానం కింద విధులు నిర్వర్తించేందుకు 2010 సం||లో టి‌టి‌డి నియమించుకున్న పోటు కార్మికులు,ఎల్‌సి‌సి‌ఎస్ లిమిటెడ్ వారికి మరో ఏడాది పాటు నియామక కాలం పొడిగింపుకు టి‌టి‌డి బోర్డు ఆమోదం తెలిపింది. మంగళవారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో టి‌టి‌డి పాలక మండలి ఛైర్మన్ డా|| చదలవాడ కృష్ణమూర్తి అధ్యక్షతన పాలక మండలి సమావేశం జరిగింది. సమావేశం అనంతరం పాలక మండలి తీసుకున్న నిర్ణయాలను ఛైర్మన్ విలేకరులకు వివరించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీవారి ఆలయంలో కొంట్రాక్ట్ విధానంలో పోటు విధులు నిర్వర్తించేందుకు నియమించుకున్న పోటు కార్మికులు, ఎల్‌సి‌సి‌ఎస్ లిమిటెడ్ వారికి నియామక కాలాన్ని పొడిగిస్తూ వీరి జీత బత్యాల కోసం 7.5 కోట్ల రూపాయిలను విడులు చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అలానే శ్రీవారి ఆలయంలో భక్తులకు ఆశీర్వచనం అందించేందుకు వినియోగిస్తున్న శఠగోపాలు దెబ్బతిన్నాయని, వాటి స్థానంలో మరో 10 బంగారు శఠగోపాలను తయారు చేసేందుకు నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఒక్కో శఠగోపం తయారీకి సుమారు 72.75 లక్షల రూపాయిలు కర్చు అవుతుందన్నారు.

ప్రస్తుతం టి‌టి‌డి రెండు శఠగోపాలను తయారు చేసేందుకు నిర్ణయం తీసుకుందని, అందులో ఒకదానికి అయ్యే కర్చు బోర్డు సభ్యుడు రామచంద్రా రెడ్డి భరించేందుకు ముందుకు వచ్చారన్నారు. అలానే భక్తులు కూడా ముందుకు వచ్చి శఠగోపాల తయారీకి విరాళం అందించాలని కోరారు. ఒంటిమిట్టలోని రామాలయం అభివృద్దిలో భాగంగా టి‌టి‌డి కళ్యాణమండపం, యాత్రి సదన్ నిర్మించేందుకు 4.60 కోట్ల రూపాయిలతో టెండర్లకు ఆమోదం తెలిపామన్నారు. అలానే ఆలయంకు సంభందించిన 75 ఏకారాల స్థలంలో ఉద్యానవనాన్ని నిర్మించనున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అర్చకుల సంక్షేమార్ధం ప్రభుత్వంచే ప్రతిపాదించబడిన సమిష్టి నిధికి 25 కోట్ల రూపాయిలను విడుదల చేశామన్నారు. ఇక తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్లోని బంజారా హీల్స్లో శ్రీ వేంకటేశ్వర ఆలయాన్ని నిర్మించేందుకు 18 కోట్ల రూపాయిలను విడుదల చేస్తూ, మే మొదటి వారంలో ఈ నిర్మాణానికి సంభందించి పునాధ్ వేసేందుకు బోర్డు సభ్యులు వెళ్లనున్నట్లు తెలిపారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో, ఇతర ఉత్సవాలలో వినియోగిస్తున్న సర్వభూపాల వాహనం, ముత్యపుపందిరి వాహనాలను 3.86 కోట్ల రూపాయిలతో నూతనంగా తయారు చేసేందుకు నిర్ణయం తీసుకున్నామని, ఇందుకోసం 13.875 కిలోల బంగారం, 555 కిలోల రాగిని వినియోగిస్తామని తెలిపారు. తిరుపతిలోని శ్రీపద్మావతి మహిళా యునివర్సిటికి టి‌టి‌డి ప్రతి ఏడాది ఇస్తున్న 50 లక్షల రూపాయిల గ్రాంటును వారి అబ్యర్ధన మేరకు 2016-17 సం|| నుండి కోటి రూపాయిలకు పెంచి ఇవ్వనున్నట్లు తెలిపారు.

టి‌టి‌డిలో పారిశుధ్య పనులు నిర్వర్తిస్తున్న సులభ్ ఇంటర్నేషనల్ సోష్యల్ సర్వీసెస్ వారి కాంట్రాక్ట్ కాలపరిమితిని 2017,మార్చి 31వ తేదీ వరకు పెంచామన్నారు. తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నదాన సముదాయంలో తాయారు చేసే సాంబారు, రసం, పచ్చడి వంటివి నిల్వ చేసేందుకు ఉపయోగించే పాత్రలను సేలంకు చెందిన స్టీల్ అథారిటి ఆఫ్ ఇండియా ప్రభుత్వ సంస్థ ద్వారా 30.7 లక్షలతో కొనుగోలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేష్ రాష్ట్రాలలో మే 22 నుంచి 29 వ తేదీ వరకు శుభప్రధం పేరిట 8,10 వ తరగతి విధ్యార్థులకు వేసవి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించెందుకు ఆమోదం తెలిపామన్నారు. ధర్మ ప్రచారం నిమిత్తం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హిందూ ధర్మ పరిరక్షణ సంస్థకు 50 లక్షల రూపాయిలు మంజూరు చేసేందుకు నిర్ణయం తీసుకున్నామని అన్నారు. తిరుపతిలో టి‌టి‌డి ద్వారా ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడుతున్న బర్డ్ ఆసుపత్రి విస్తరణ, ఆపరేషన్ ధియేటర్లు, ఓ‌పి బ్లాక్ నిర్మించేందుకు 7.08 కోట్లు నిధులు విడుదల చేశామన్నారు. అలానే స్విమ్స్ ఆసుపత్రిలో మెడికల్ వార్డులు, మైక్రో బయాలజీ ల్యాబ్లు ఇతర నిర్మాణ పనులకు 4.80 కోట్ల రూపాయిలు విడుదల చేశామన్నారు. మహబూబానగర్ జిల్లా ఆలంపూర్లోని శ్రీ స్వయంభు తిమ్మప్పస్వామి ఆలయంలో పెండింగ్లో ఉన్న కళ్యాణమండపం నిర్మాణ పనులకు 35 లక్షల రూపాయిలు మంజూరు చేశామన్నారు.

అనంతపురం జిల్లా హిందూపూర్లోని శ్రీరంగనాధస్వామి ఆలయంలో పుష్కరిణి నిర్మాణానికి 55 లక్షల రూపాయిలు, లేపాక్షి, చిలమత్తూరులో టి‌టి‌డి కళ్యాణమండపం నిర్మాణానికి 1.25 కోట్ల రూపాయిలను మంజూరు చేశామన్నారు. ఇక శ్రీవారి ప్రసాదాల తాయారీలో వినియోగించే 6 నెలలకు సరిపడ 20 లక్షల కిలోల ఆగ్ మార్క్ ఆవు నెయ్యను కిలో 332.10 రూపాయిలకు కొనుగోలు చేసేందుకు 66.42 కోట్లు, ఒక సంవత్సరానికి సరిపడ 8000 నువ్వుల నూనె టిన్నులను కిలో 1485 రూపాయిల చొప్పున కొనుగోలు చేసేందుకు 1.18 కోట్ల రూపాయిలు మంజూరు చేశామన్నారు.కెన్యా దేశ రాజధాని నగరం నైరోభిలోని శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో మే 22 నుంచి శ్రీనివాస కళ్యాణం నిర్వహించేందుకు ఆమోదం తెలిపామన్నారు. తిరుచానూరులోని తొలప్ప గార్డెన్లో అన్నదాన సముదాయం నిర్మించేందుకు 6.7 కోట్ల రూపాయిలు, తిరుపతిలోని టి‌టి‌డి పరిపాల భవన ప్రాంగణంలో నూతనంగా ట్రెజరీ, పరకామణి భవనాల నిర్మాణానీకి 4 కోట్ల రూపాయిలను విడుదల చేసేందుకు ఆమోదం తెలిపామన్నారు.

మే 10 నుంచి రామానుజ సహస్రాబ్ధి ఉత్సవాలను ప్రారంభంకానున్నాయని, అదే రోజున తిరుమల నుంచి రామానుజ రథసంచారం ప్రారంభించి 106 దివ్య దేశాలలో పర్యటిస్తూ ధర్మ ప్రచారం చేసేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. అలానే ఈ కార్యక్రమంలో భాగంగా ప్రధానమైన క్లస్టర్ కేంద్రాలలో శ్రీవారి కల్యాణోత్సవం, ప్రవచనాలు ఏర్పాటు చేస్తామని, రామానుజ సాహిత్యాన్ని పుస్తకాలు, డి‌వి‌డిలు విశేషంగా భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు నిర్ణయం తిఒసుకున్నామని తెలిపారు. తలనీలాల ఇ-వేలం ద్వారా ఫిబ్రవరి నెలకు గాను 4.57 కోట్లు, మార్చి నెలకు గాను 23.19 కోట్ల రూపాయిలు ఆదాయం లభించిందన్నారు. ఈ సమావేశానికి ముందు టి‌టి‌డి పాలక మండలి అధ్యక్షుడు పి‌ఎస్ గిరిధర్ ఎస్వీ గోసంరక్షణ పధకానికి 10 లక్షల రూపాయిలను, తిరుపతికి చెందిన సుబ్రమణ్యం ఎస్వీ నిత్యాన్నదాన పధకానికి 10 లక్షల రూపాయిలను, హైదరాబాద్కు చెందిన గిరిమనోహర్రావు 1,01,116 రూపాయిలను ఛైర్మన్ చేతుల మీదుగా టి‌టి‌డి‌కి విరాళంగా అందించారు. ఈ సమావేశంలో టి‌టి‌డి ఈఓ సాంబశివరావు, తిరుమల జెఈఓ శ్రీనివాసరాజు, బోర్డు సభ్యులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.. Related posts

Leave a Comment