72 వసంతాలు పూర్తిచేసుకొన్న అత్యద్భుత ఘాటు రోడ్లు…!!



ప్రపంచంలోనే అత్యద్భుతమైన దేవాలయంగా పేరుగాంచిన తిరుమల తిరుపతి దేవ స్థానానికి ఎంత పేరు ఉందో, అంతే పేరు ప్రఖ్యాతలనుగాంచాయి తిరుమల ఘాట్ రోడ్లు. ప్రస్తుతం తిరుమలకు రెండు ఘాట్ రోడ్లు ఉన్నాయి. ఒకటి తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లడానికి రెండోది తిరుమల నుంచి తిరుపతికి రావడానికి ఏర్పాటు అయ్యాయి. అయితే, ఈ ఘాట్ రోడ్లకు రమణీయమైన ప్రకృతి సౌందర్యాలను వీక్షించే రహదారులుగానే కాకుండా, అత్యంత ముల ములుపు ఉన్న ప్రమాదకరమైన రహదారులుగా కూడా గుర్తిపుగాంచాయి.
FB_IMG_1461083587132
తిరుపతి నుంచి తిరుమలకు ఘాట్‌ రోడ్డులో వెళ్ళాలంటే కనీసం 30 నిమిషాలకుపైగా సమయం పడుతుంది. అదే తిరుమల నుంచి తిరుపతికి రావాలంటే 45 నిమిషాల సమయం. ఘాట్‌ రోడ్లంటే సాదా సీదా రోడ్లు కావు. ఎన్నో మలుపులు. శేషాచలం అడవుల్లో నుంచి వేసిన రోడ్లు ఇవి. 1944వ సంవత్సరం ఏప్రిల్‌ 10లో నాటి ప్రముఖ ఇంజనీర్‌ మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఈ ఘాట్‌ రోడ్డును వేశారు. మొదటగా ఘాట్‌ రోడ్డును అప్పటి మద్రాస్‌ గవర్నర్‌ ఆర్తూర్‌ హోప్‌ ప్రారంభించారు. మొదట్లో ఘాట్‌రోడ్డులో చిన్నపాటి బస్సులు వెళ్లేవి. అవి క్రమేపి పెద్దదిగా మారాయి. అప్పటి నుంచి ఇప్పటివరకు మోక్షగుండం విశ్వేశ్వరయ్య వేసిన రోడ్లపైనే రోడ్లు వాడుతున్నారే గానీ, వేరే రోడ్లు మాత్రం వేయలేదంటే ఆయన ఘాట్‌ రోడ్డు వేయడానికి ఎంత శ్రమపడ్డారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.

ఎంతో ప్రమాదకరమైన మలుపుల రోడ్లను వేయడమంటే సాదా సీదా విషయం కాదు. అప్పట్లోనే ఘాట్‌ రోడ్డు వేయడానికి సంవత్సరంకుపైగా సమయం పట్టిందంటే ఎంతకష్టమో ఇట్టే అర్థమైపోతుంది. అయితే ప్రస్తుతం తితిదే ఇంజనీరింగ్‌ అధికారులు మాత్రం తారు రోడ్డు మీద తారు రోడ్లు వేస్తూనే ఉన్నారు. తిరుమల ఘాట్‌ రోడ్డు వేసి 72 వసంతాలు పూర్తి కావడంతో తితిదే ఇంజనీరింగ్‌ విభాగం సంబరాలు చేసుకుంటోంది. 1944 సంవత్సరంలో వేసిన రోడ్లుపైనే మరో రోడ్లు వేయడం నిజంగా వారిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తితిదే అధికారులను మాత్రమే కాదు తిరుమలకు వచ్చే భక్తులందరికీ ఘాట్‌ రోడ్లను చూస్తే ఆశ్చర్యపోక తప్పదు.

This slideshow requires JavaScript.

Orugunda Suresh
Sr Reporter

Orugunda Suresh is an electronic media journalist with eight plus years of experience. He excels in visual communication and has worked as correspondent for premier media organisations such as Maa TV, Mahaa TV,  TV9 Network, ETV Network(TV18 Group), Studio N. He contributes news stories and features  to thirupatinews.com from Tirumala and Tirupati.



Related posts

Leave a Comment