వైభవంగా శ్రీవారి స్వర్ణరథోత్సవం

Resized 3తిరుమల: తిరుమల శ్రీవారి వసంతోత్సవంలో రెండో రోజు ఉదయం శ్రీ వేంకటేశ్వరస్వామి వారు రథోత్సవంపై ఊరేగారు. ఉదయం 8 నుంచి 9 గంటల వరకు ఈ ఉత్సవం కన్నుల పండువగా సాగింది. 30 అడుగుల ఎత్తున్న బంగారు కాంతుల స్వర్ణరథంలో స్వామి వారు ఊరేగింపు భక్తులను తన్మయపరచింది.

రథాన్ని లాగటానికి మహిళలు భక్తి శ్రద్ధలతో పోటీ పడ్డారు. గోవిందనామస్మరణతో తిరుమల మారు మ్రోగింది.
రథోత్సవం అనంతరం స్వామి వారు తిరుమల పడమటమాడవీధిలోని వసంతోత్సవ మండపానికి విచ్చేశారు. అక్కడ వసంతోత్సవం నిర్వహించారు.Related posts

Leave a Comment