శ్రీవారి సేవలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఠాకూర్యాంకర్: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఠాకూర్ తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు.  కుటుంభ సభ్యులతో కలసి శ్రీవారిని దర్శించుకునేందుకు విచ్చేసిన ఆయనకు ఆలయ మహాద్వారం వద్ద టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో సాంబశివరావు, జేఈవో శ్రీనివాసరాజు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆయనకు ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం పలకగా, చైర్మన్, ఈవో శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అయన వెంట సుప్రీం కోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కూడా శ్రీవారిని దర్శించుకున్నారు.Related posts

Leave a Comment